Thursday, April 25, 2024

‘విరాట్ పర్వం’ నుంచి ‘కోలు కోలు’ సాంగ్..

- Advertisement -
- Advertisement -

Virata Parvam first lyrical song on Feb 25th

దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘విరాటపర్వం’. ‘రివల్యూషన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కామ్రేడ్ రవి అనే పాత్రలో రానా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్.. ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ‘విరాట పర్వం’ సినిమా నుంచి ‘కోలు కోలు’ అనే సాంగ్ లిరికల్ వీడియోని ఈనె 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా లంగావోణిలో ఉన్న సాయి పల్లవి డ్యాన్స్ పోజుతో కూడిన ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

Virata Parvam first lyrical song on Feb 25th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News