Home తాజా వార్తలు నక్సలైట్ ఉద్యమం ఆధారంగా ’విరాటపర్వం‘

నక్సలైట్ ఉద్యమం ఆధారంగా ’విరాటపర్వం‘

Virataparvam Movie Makes on Naxalite Movement Basicహైదరాబాద్  : 1990లో తెలంగాణలో జరిగిన నక్సలైట్ ఉద్యమం ఆధారంగా ’విరాటపర్వం‘ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటిస్తుండగా ప్రముఖ నటీమణులు ప్రియమణి, సందితాదాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలంగాణకు చెందిన నక్సలైట్, ప్రజా గాయని బెల్లి లలిత పాత్రలో సాయి పల్లవి నటిస్తుందన్న పుకార్లు టాలీవుడ్ లో షికార్లు చేశాయి. సాయి పల్లవి బెల్లి లలిత పాత్రలో నటించడం లేదని, అయితే సాయిపల్లవి పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని వేణు ఊడుగుల తెలిపారు. తాను వరంగల్ జిల్లాకు చెందిన వాడినని, వరంగల్ కేంద్రంగా ఎన్నో నక్సలైట్ ఉద్యమాలు జరిగాయని ఆయన వెల్లడించారు. సమాజంలో మార్పు కోసం భయం లేకుండా పోరాడిన వాళ్లను తాను చూశానని, వారు చేసిన పోరాటాలనే ఇతివృత్తంగా ’విరాటపర్వం‘ తీస్తున్నట్టు ఆయన చెప్పారు.