Thursday, April 25, 2024

హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్‌లు

- Advertisement -
- Advertisement -

Virataparvam

 

రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విరాటపర్వం’. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. త్వరలోనే ఆ షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రానికి కొంతమంది హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పనిచేస్తుండటం విశేషం. ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణల్లో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఉరిః ద సర్జికల్ స్ట్రైక్’కు పనిచేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచెర్ ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లకు రూపకల్పన చేశారు.

యాక్షన్ సహా అన్ని రకాల సన్నివేశాలకు రానా, ఇతర తారాగణం పూర్తిస్థాయిలో శ్రమిస్తుండగా… ఉన్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. డి.సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి నందితా దాస్, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన డానీ సాంచెజ్, లోపెజ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. ఈ వేసవిలో ‘విరాటపర్వం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Virataparvam movie updates
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News