Friday, March 29, 2024

2 కోట్ల చైనా స్మార్ట్‌ఫోన్ల‌లో వైరస్

- Advertisement -
- Advertisement -

Virus in 2 crore Gionee smartphones

 

చైనా : జియోనీ కంపెనీ 2 కోట్ల‌కు పైగా యూజ‌ర్ల‌ స్మార్ట్‌ఫోన్ల‌లో మాల్‌వేర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తాజాగా విచార‌ణ‌లో తేలింది. జియోనీ అనుబంధ సంస్థ అయిన షెంజెన్ ఝిపు టెక్నాల‌జీ కంపెనీ లిమిటెడ్ స్టోరీ లాక్ స్క్రీన్ యాప్‌కు అప్‌డేట్‌ ద్వారా ట్రోజ‌న్ హార్స్‌ను జియోనీ స్మార్ట్‌ఫోన్ల‌లో ప్ర‌వేశ‌పెట్టింది. యాడ్స్‌, ఇత‌ర మార్గాల ద్వారా యూజ‌ర్ల ఫోన్ల నుంచి అక్ర‌మంగా లాభాలు ఆర్జించ‌డానికి జియోనీ సంస్థ ఈ మాల్‌వేర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు చైనాకు చెందిన జ‌డ్జ్‌మెంట్ డాక్యుమెంట్ నెట్‌వ‌ర్క్ గుర్తించింది.  2018 డిసెంబ‌ర్ – 2019 అక్టోబ‌ర్ మ‌ధ్య ఈ ప‌ని చేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. 2.17 కోట్ల స్మార్ట్‌ఫోన్ల‌లో లివింగ్ ట్రోజ‌న్ హార్స్ అప్‌డేట్ చేయ‌డానికి డార్క్ హార్స్ ప్లాట్‌ఫామ్ వాడిన‌ట్లు గుర్తించారు. ఈ టెక్నిక్ ద్వారా ఆ కంపెనీ అద‌నంగా 27.85 మిలియ‌న్ల యువాన్‌లు (సుమారు రూ.31 కోట్లు) ఆర్జించిన‌ట్లు తేలింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News