Friday, April 26, 2024

ఒక్కరితో 80 మందికి

- Advertisement -
- Advertisement -

 

సూర్యాపేటలో కలకలం రేపుతున్న కొవిడ్, మటన్, కూరగాయల వ్యాపారుల ద్వారానే అత్యధికంగా వ్యాప్తి?

మన తెలంగాణ/హైదరాబాద్ : సూర్యపేట్ జిల్లాల్లో కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఒకే ఒక్కరితో 80 మంది వరకు వైరస్ బారీన పడటం ఆ ప్రాంతవాసులను ఆందోళన రేకెత్తిస్తోంది. మర్కజ్ ప్రార్థనల్లో పాల్లొన్న వ్యక్తి నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని అధికారులు స్పష్టం చేశారు. అయితే సూర్యాపేట జిల్లాల్లో ఒక్కసారిగా కేసులు పెరగడంతో అధికారులతో పాటు ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఎలాంటి డెత్‌లు లేవు. కానీ ఏప్రిల్ 2 తేదిన తొలి కేసు నమోదైనప్పటి నుంచి వైరస్ ఉదృతి వేగంగా ఉంది. కేవలం 19 రోజుల్లో వైరస్ బారీన పడిన సంఖ్య 80కి చేరుకోవడం ఆందోళన కల్గించే అంశం. ఇప్పటి వరకు జిల్లాలో 796 మందికి పరీక్షలు నిర్వహించగా, 191 మంది రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా పాజిటివ్ వ్యక్తులను ప్రత్యక్షంగా కలసిన వ్యక్తులు, కుటుంబ సభ్యుల్లో 210 మంది ప్రభుత్వ సెంటర్లలో క్వారంటైన్ ఉండగా, 4346 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

వైరస్ ఇలా ఎంట్రీ అయ్యింది……
సూర్యాపేట్‌లో కరోనా వైరస్ దాడి చేస్తుంది. అయితే తొలి సారిగా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మాత్రం మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారేనని అధికారులు తెలిపారు. పట్టణంలో నివసించే ఓ మటన్ వ్యాపారీ గత నెలలో ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చాడు. ఇటీవల దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉండటంతో స్థానికంగా ఉండే ఏరియా ఆసుపత్రికి వెళ్లాగా శాంపిల్స్ సేకరించి గాంధీ ఆసుపత్రిలో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సూర్యపేట్ లో తొలి పాజిటివ్ కేసు ఏప్రిల్ 2న నమోదైంది. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు, ప్రత్యక్షంగా కలసిన వ్యక్తులనూ అధికారులు క్వారంటైన్ చేశారు.

ఇంతమందికి ఎలా సోకింది..?
ఒకరి ద్వారా 80 మందికి ఎలా సోకిందని ఆరా తీయడానికి అధికారులు నిద్రలేని రాత్రులు గడిపారు. జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టి మరి ఎట్టకేలకు లింక్‌ను చేధించారు. ప్రస్తుతం ఈ లింక్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ లింక్‌పై మాత్రం స్పష్టత వచ్చింది. సూర్యపేట్‌లో స్థానికంగా ఉండే ఓ వ్యక్తి మటన్ వ్యాపారం పేరిట రహాస్యంగా ఆవులు, ఎద్దులు మాంసాలను విక్రయిస్తుంటాడు. మార్చిలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు ఈ వ్యక్తి వెళ్లోచ్చిన తర్వాత కూడా యథవిధిగా తమ వ్యాపారాన్ని కొనసాగించాడు. దుకాణంలో అమ్మడంతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా పార్సిళ్ల రూపంలో మాంసాన్ని విక్రయించేవాడు. అయితే మార్చి నెల చివరిలో అతనికి తీవ్రమైన దగ్గు, జలుబు రావడం స్థానికంగా ఉండే అపోలో ఫార్మాసిలో మెడిసిన్స్ తీసుకొని నాలుగు రోజుల పాటు వాడాడు.

చివరికి తగ్గకపోవడంతో స్థానికంగా ఉంటే ఏరియా ఆసుపత్రిని సంప్రదించగా, శాంపిల్స్ సేకరించి టెస్టులు చేశారు. అయితే ఇతను తన వ్యాపారంలో భాగంగా అనేక ప్రాంతాలు విచ్చలవిడిగా తిరిగాడు. ముఖ్యంగా తన అత్తగారి ఊరు నాగారం మండలం వర్థమాన్‌పేట్ లో కూడా మాసం విక్రయించాడు. ఈక్రమంలో అక్కడ ఆరుగురికి వైరస్ సోకింది. ఇదిలా ఉండగా, ఈ వ్యక్తి మెడిసిన్స్ తీసుకున్న అపోలో ఫార్మాసిస్ట్‌కు కూడా జలుబు, దగ్గు ఉండటంతో కరోనా టెస్టులు చేయగా అతనికీ వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ వ్యక్తితో ప్రత్యక్షంగా కలసిని వ్యక్తులను, కుటుంబ సభ్యులకు అధికారులు పరీక్షలు నిర్వహించారు.

మరో వైపు ఫార్మాసిస్ట్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే ఓ కురగాయల వ్యాపారికీ వైరస్ సోకింది. ఈ కురగాయల వ్యాపారికీ ఒళ్లు నొప్పులు, జలుబు ఉండటంతో ఏరియా ఆసుపత్రికి వెళ్లగా శాంపిల్స్ సేకరించి వైద్యులు హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించి, కరోనా పాజిటివ్‌గా తేల్చారు. అయితే మటన్, ఫార్మాసిస్ట్ ద్వారా సుమారు 30 మందికి వైరస్ సోకగా, ఈ కురగాయల వ్యాపారి నుంచి సుమారు 30 నుంచి 35 మందికి వైరస్ సోకినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లింక్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చైన్‌ను బ్రేక్ చేసేందుకు మాత్రం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అధికారులంతా అప్రమత్తం….
రాష్ట్రంలో కరోనా వైరస్ ఆందోళన సృష్టిస్తుంది. క్రమంగా తగ్గుతుందని బావించిన అధికారుల అంచనా తారుమారయ్యేలా కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే సూర్యపేట్ జిల్లాలో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఒక వైపు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నప్పటికీ, వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే అత్యధిక కేసులు నమోదవుతుండగా, మంగళవారం సూర్యపేట్ జిల్లాలో ఒక్క రోజులో 26 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల తర్వాత, సూర్యపేట్, నిజామాబాద్, గద్వాల్ జిల్లాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది.

రాష్ట్రంలో నమోదైన కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు మర్కజ్‌లింక్‌నుంచి వస్తుండగా, సూర్యపేట్ జిల్లాల్లో నమోదవుతున్న పాజిటివ్‌లను పరిశీలిస్తే అధికారులకు వైరస్ వ్యాప్తికి కారణాలు లభించడం లేదు. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ, మర్కజ్ లింక్ లేకుండానే కొన్ని జిల్లాల్లో కేసులు నమోదవుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూర్యపేట్‌లో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కూడాత నియమించింది. వైరస్ ప్రభావం గమనించిన మంత్రి జగదీష్‌రెడ్డి కూడా హుటాహుటిన అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక రివ్యూ నిర్వహించారు.

 

Virus to 80 people with one
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News