Home తాజా వార్తలు బిల్‌డెస్క్ తో భాగస్వామిగా వీసా

బిల్‌డెస్క్ తో భాగస్వామిగా వీసా

Visa, Billdesk

 

న్యూఢిల్లీ: చెల్లింపుల సాంకేతిక పరిజ్ఞానంలో అంతర్జాతీయ అగ్రగామి వీసా, భారతీయ చెల్లింపుల వ్యాపార అగ్రగామి బిల్ డెస్క్ కలసి ఎస్‌ఐ -హబ్‌ను ప్రకటించాయి. ఒకసారి నమోదుతో కార్డులను ఉపయోగించి చేసే పునరావృత చెల్లింపులకు ఒక సురక్షితమైన మార్గం ఎస్‌ఐ- హబ్. వివిధ రకాల సేవలు, సబ్ స్క్రిప్షన్ సేవలు, మ్యూచువల్ ఫండ్ సిప్ లాంటి వాటితో సహా చెల్లింపులు చేయడంలో తమ కార్డుదారులకు రికరింగ్ పేమెంట్స్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ (ఎస్‌ఐ) సేవలు అందించేందుకు బ్యాంకులకు, మర్చంట్స్‌కు ఇది వీలు కల్పిస్తుంది.

పునరావృతమయ్యే లావాదేవీల కోసం కార్డులపై ఇ-మాండేట్ కోసం ఆర్‌బిఐ ఇటీవల మార్గ దర్శకాలను విడుదల చేసింది. వీసా ఇండియా, దక్షిణ ఆసియా గ్రూప్ కంట్రీ మేనేజర్ టి.ఆర్.రామచంద్రన్ మాట్లాడుతూ పునరావృత చెల్లింపు అవసరాలకు సంబంధించి భారతదేశం విస్తారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న మార్కెట్ అని అన్నారు. వ్యాపారులు, బ్యాంకుల ద్వారా పునరావృతమయ్యే చెల్లింపుల కోసం వినియోగదారు తన వివరాలు నమోదు చేసిన తర్వాత, అన్ని చెల్లింపులు ఎస్‌ఐ- హబ్ ద్వారా వినియోగదారునికి సకాలంలో నోటిఫికేషన్‌లతో సజావుగా పూర్తవుతాయి.

Visa Strengthens India Play With Investment In BillDesk