Home తాజా వార్తలు ‘మోహన్‌దాస్’ సినిమా నుంచి విష్ణు విశాల్‌ లుక్ విడుదల

‘మోహన్‌దాస్’ సినిమా నుంచి విష్ణు విశాల్‌ లుక్ విడుదల

Vishnu Vishal Second Look Release From Mohandasహైదరాబాద్ : విష్ణు విశాల్‌ హీరోగా నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ వివి స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్న సినిమా ‘మోహన్‌దాస్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విష్ణు విశాల్‌ ఫస్ట్‌లుక్‌ విడుదలై ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి విష్ణు విశాల్‌  సెకండ్‌ లుక్‌ను విడుదల చేశారు. మురళి కార్తీక్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విష్ణు విశాల్‌ కు జోడీగా  ఐశ్వర్య రాజేష్‌ నటిస్తున్నారు. ఇంకా  ఇంద్రజిత్‌ సుకుమారన్‌, షారీక్‌ హాసన్‌, ప్రకాష్‌ రాఘవన్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు  కేఎస్‌ సుందరమూర్తి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని విష్ణు విశాల్‌ తెలిపారు.