Home తాజా వార్తలు ‘విశ్వాసం’ ట్రైలర్‌ విడుదల (వీడియో)

‘విశ్వాసం’ ట్రైలర్‌ విడుదల (వీడియో)

Viswasam Trailer Releasedచెన్నయ్ : ప్రముఖ హీరో అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాలో  నయనతార కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, సత్యరాజ్‌, ప్రభు గణేశన్‌, సంపత్‌రాజ్‌, యోగిబాబు, వివేక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్యాగరాజన్‌ సమర్పిస్తున్నారు. ఇమాన్‌ బాణీలు అందించారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. అజిత్‌ తన యాక్షన్‌తో అదరగొట్టారు. నయనతార తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో అజిత్‌ ఊరి జనం కోసం బతికే వ్యక్తిగా కనిపించనున్నారు. ‘వివేకం’ తర్వాత అజిత్‌ నటించిన చిత్రమిది. అజిత్‌, శివ కాంబినేషన్‌లో వస్తోన్న నాల్గో చిత్రం కావడం గమనార్హం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వీరం’, ‘వేదాలం’, వివేగం’ తదితర సినిమాలు వచ్చాయి. ‘విశ్వాసం’ తర్వాత అజిత్‌ ‘పింక్‌’ సినిమా తమిళ రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమాను శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

Viswasam Trailer Released