Tuesday, April 23, 2024

జానపద బ్రహ్మ విఠలాచార్య గొప్ప దర్శకుడు, నిర్మాత

- Advertisement -
- Advertisement -

Vithalacharya is one of the most recognizable folk films

తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మ గా సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న చరిత ఆయ న సొంతం. ఆయన ఎవరితో సినిమాలు చేసినప్పటికీ… ఆ సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. దశాబ్దాలుగా సినీ ప్రేమికు లు ఆదరించి, ఆస్వాదిస్తున్న విఠలాచార్య సిని మా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. ఆ సమగ్ర పుస్తకానికి ‘జై విఠలాచార్య’ అని పేరు పెట్టారు. ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలా న్ బాషా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు. ఈ పుస్తక ం ఫస్ట్ లుక్‌ని తమ సువర్ణహస్తాలతో విడుదల చేశా రు సూపర్‌స్టార్ కృష్ణ. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ “విఠలాచార్య దర్శకత్వం లో నేను ఒకే ఒక్క సినిమా చేశాను.

అది ‘ఇద్దరు మొనగాళ్లు’. ఆ సినిమా హిట్ అయింది. నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో ఆయన సినిమాలు చూశాను. కాంతారావు హీరోగా ఆయన చాలా జా నపద సినిమాలు చేశారు. విఠలాచార్యపై పుస్తకం తీసుకువస్తుండటం సంతోషంగా ఉంది” అని అన్నారు. పులగం చిన్నారాయణ మాట్లాడుతూ “జానపద బ్రహ్మ విఠలాచార్య సినీ ప్రయాణానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రాసిన పుస్తకం ‘జై విఠలాచార్య’. విఠలాచార్య గొప్ప దర్శకుడు మాత్రమే కాదు గొప్ప నిర్మాత కూడా. తక్కువ బడ్జెట్‌లో వేగంగా, పొదుపుగా సినిమాను ఎలా తీయవచ్చనేది ఆయన ఆచరించి చూపించారు. విఠలాచార్య శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేశాం. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News