Home టెక్ ట్రెండ్స్ వై51 ఆవిష్కారించిన వివో

వై51 ఆవిష్కారించిన వివో

Vivo has launched its Y51 smartphone in India

 

న్యూఢిల్లీ : గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో దేశీయ మార్కెట్లోకి సరికొత్త వై51 ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా కంపెనీ వై సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. 8జిబి+128జిబి ధర రూ.17,990 నిర్ణయించారు. అన్ని కొత్త వై51 టైటానియం సాప్ఫిరే, క్రిస్టల్ సింఫొనీ అనే రెండు అద్భుతమైన రంగుల్లో లభిస్తోంది. వివో వై51 8జిబి రామ్, 18డబ్లు ఫాస్ట్ చార్జ్ టెక్నాలజీతో కూడిన 5000 ఎంఎహెచ్ బ్యాటరీతో లభిస్తుంది. వై51 లో 48ఎంపి ఎఐ సామర్థంతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా ఇన్‌బిల్ట్ మల్టిపుల్ షూటింగ్ మోడ్‌లతో సెటప్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16.71 సెం.మీ (6.58) డిస్‌ప్లే ఉంది.

Vivo has launched its Y51 smartphone in India