Home టెక్ ట్రెండ్స్ వి21ను ఆవిష్కరించిన వివో

వి21ను ఆవిష్కరించిన వివో

Vivo has launched the V21 5G in India

 

న్యూఢిల్లీ : వివో వి21 5జి ఫోన్ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ట్రిపుల్ రేర్ కమెరాలు, 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ఎస్‌ఒసి వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌లో విడుదల చేసిన వివో వి20 సక్సెసర్‌గా వివో కొత్త ఫోన్ వచ్చింది. వివో వి21 ధర (8జిబి + 128జిబి) రూ.29,990, అదే సమయంలో (8జిబి +256జిబి) ధర రూ.32,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ మే 6 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.

Vivo has launched the V21 5G in India