Home టెక్ ట్రెండ్స్ స్మార్ట్‌ఫోన్‌లపై వివో ప్రత్యేక ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లపై వివో ప్రత్యేక ఆఫర్లు

Vivo special offers on smartphones

 

న్యూఢిల్లీ : పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ మొబైల్ సంస్థ వివో స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లను ప్రకటించింది. వివో ఎక్స్ 70 సిరీస్, వి21 సిరీస్ వై73 వివో ఫ్లాగ్‌షిప్ లైనప్ ఎక్స్ సిరీస్ ప్రీమియం వంటి సరికొత్త ఫోన్లు ఉన్నాయి. ఇటీవల ప్రారంభించిన వివో ఎక్స్70 సిరీస్ ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరా అనుభవాన్ని ఇస్తుంది. అదేవిధంగా వి, వై సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు డిజైన్, ఇంజినీరింగ్, ఇన్నోవేషన్‌లో అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో గొప్ప స్మార్ట్‌ఫోన్ డీల్‌ను పొందాలనుకునే వారికి కెమెరా సామర్థ్యాలు, ఇతర అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను పొందడానికి ఇది చివరి అవకాశంగా సంస్థ చెబుతోంది. ఈ ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లు అక్టోబర్ 15 వరకు అన్ని ప్రధాన రిటైల్ భాగస్వాములు, వివో ఇండియా ఇ-స్టోర్, ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో అందుబాబాటులో ఉంటాయి. ఎక్స్70 సిరీస్ రూ.79,990 (12+256జిబి) ధరతో, ఎక్స్70 ప్రొ+ అక్టోబర్ 12 నుండి అమ్మకానికి వస్తుంది. ఎక్స్70 ప్రో ధర రూ.46,990 (8+128జిబి), రూ.49,990 (8+256జిబి) రూ.52,990 (12+256జిబి) అక్టోబర్ 7 అమ్మకానికి వచ్చింది.

Vivo special offers on smartphones