న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ఇండియా సరికొత్త వి21 5జి నియాన్ స్పార్క్ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం నియాన్ స్పార్క్‌ను రూపొందినట్టు కంపెనీ తెలిపింది. 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.29,990గా కంపెనీ నిర్ణయించింది. ఇక 8జిబి+256జిబి ధర రూ.32,990గా ఉంది. వివో వి21 ఫీచర్లు 6.44 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే (24041080 పిక్సెల్), 90హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో డిస్ప్లే వస్తోంది. ఇంకా 8జిబి ర్యామ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ ఉంది.
Vivo V21 5G neon spark launched in india