న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన వై సిరీస్ ఫోన్లలో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. వివో వై75 5జి పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఇది సెల్ఫీ స్నాపర్ కోసం వాటర్‌డ్రాప్ నోచ్‌తో వస్తోంది. ట్రిఫుల్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 18డబ్లు చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వివో వై75 స్పెసిఫికేషన్లలో 6.58 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700, 50 ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీని కల్గివుంది. వివో వై75 5జి ధర (8జిబి + 128జిబి) రూ.21,990గా ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా అందుబాటులోకి వచ్చింది.
Vivo Y75 5G launched in India