Tuesday, January 31, 2023

ట్రంప్‌కు పుతిన్ సాయం చేశారట..?

- Advertisement -

Putin-Trump

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా హిల్లరీ క్లింటన్‌పై డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారిక బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త సంచలనం సృష్టిస్తుంది. అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయపడ్డారని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ద్వారా తెలిసింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం నిర్వహించాలో… ప్రజలను ఏ విధంగా ఆకర్షించాలో.. పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే గతంలో ఈ వార్తను రష్యా కొట్టిపారేసినప్పటికి.. ఇప్పుడు పక్కాగా నివేదిక వెలువడటంతో నోరు మెదపడంలేదు. ఈ నివేదికపై ట్రంప్ స్పందించారు. అయితే ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న అంశంపై ఆయన మాట్లాడలేదు కానీ.. ఈ వార్తల ప్రభావం అమెరికా ఎన్నికలపై పడలేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles