Friday, March 29, 2024

2036 వరకు రష్యా అధ్యక్షునిగా పుతిన్

- Advertisement -
- Advertisement -

Vladimir Putin to continue as Russian President till 2036

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకు అధికారంలో కొనసాగేందుకు భారీ మద్దతు లభించింది. ఈమేరకు దేశ రాజ్యాంగాన్ని సవరించడానికి దాదాపు 78 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారని ఓట్ల లెక్కింపు తరువాత రష్యా ఎన్నికల అధికారులు గురువారం ప్రకటించారు. అయితే ఈ ఓట్లు రిగ్గింగ్ జరిగిందని రాజకీయ వ్యాఖ్యాతలు ఆరోపించారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 77.9 శాతం మంది రాజ్యాంగ సవరణకు అనుకూలంగా ఓటు వేయగా, 21.3 శాతం మంది వ్యతిరేకించారు. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు జరిగింది. పోలింగ్ 64 శాతం మించి జరిగింది. గత పదేళ్లలో పుతిన్‌కు అత్యధిక స్థాయిలో ఓటర్ల మద్దతు లభించిందని ఓట్ల సంఖ్య చెబుతోందని అధికారులు పేర్కొన్నారు.

Vladimir Putin to continue as Russian President till 2036

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News