Thursday, March 28, 2024

విఎన్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఎనర్జిటిక్ హీరో సాయిరాం శంకర్ కథానాయకుడిగా విఎన్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 లాంఛనంగా ప్రారంభమైయింది. పోలవరం బంగారమ్మ అమ్మవారి గుడిలో చిత్ర పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ప్రకాష్ జూరెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 90‘s లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా విలేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రమణి జూరెడ్డి నిర్మిస్తున్నారు.

ముహూర్తం సన్నివేశంలో ” గంగ తలపై ఉన్నంత వరకే శివుడు చల్లగా ఉంటాడు. కంట్లోంచి గానీ జారిందా శివమెత్తుతాడు”అని సాయిరాం శంకర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం మేజర్ హైలెట్. అఫీషియల్ గా హైదరాబాద్ లో గ్రాండ్ గా ఓపెనింగ్ నిర్వహించి ఈ చిత్రానికి సంబధించిన మిగతా వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News