Wednesday, April 24, 2024

వొడాఐడియా నష్టం తగ్గింది..

- Advertisement -
- Advertisement -
Voda Idea Q1 net loss widens to Rs 7312.9 crore
క్యూ1లో నష్టం రూ.7,319 కోట్లు

న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ జూన్ త్రైమాసికంలో కొంత మేరకు నష్టాలను తగ్గించుకుంది. ఏప్రిల్‌జూన్ కాలంలో కంపెనీ నికర నష్టం రూ.7,319 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థకు రూ.25,460 కోట్ల నష్టం వచ్చింది. మార్చి త్రైమాసికంలో కూడా కంపెనీకి రూ.7,000 కోట్ల నష్టం ఉంది. కంపెనీ ఆదాయం రూ. 9,152 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.10,659 కోట్ల ఆధాయంతో పోలిస్తే ఈసారి తగ్గింది. మార్చి త్రైమాసికంలో రూ.107 గా ఉన్న ఆర్పు రూ.104 వద్ద ఉంది. లాక్‌డౌన్ కారణంగా అంతకుముందు త్రైమాసికం కంటే ఇంటర్నెట్ డేటా డిమాండ్ 13.2 శాతం ఎక్కువగా ఉంది. వొడాఫోన్ ఐడియా సిఇఒ రవీంద్ర థక్కర్ మాట్లాడుతూ, కంపెనీ నిధుల సేకరణ కోసం పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందని అన్నారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీపై మొత్తం అప్పు రూ.1,91,590 కోట్లుగా ఉంది.

దీనిలో రూ.1,06,010 కోట్లు స్పెక్ట్రం చెల్లింపు బాధ్యత, రూ .62,180 కోట్ల ఎజిఆర్ బకాయిలు ఉన్నాయి. ఎజిఆర్ విషయంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను కంపెనీ దాఖలు చేసింది. అయితే వోడాఫోన్ ఐడియాతో సహా ఇతర టెలికాం కంపెనీల పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా జూన్ 7న క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు ఒక లేఖ రాశారు. దీనిలో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐ)లో తన వాటాను ప్రభుత్వానికి లేదా కంపెనీ కార్యకలాపాలను కొనసాగించగల ఏదైనా సంస్థకు అప్పగించే సిద్ధంగా ఉన్నానని ఆఫర్ చేశారు. కంపెనీ నిర్వహణ కష్టంగా మారిందని అన్నారు. బ్రిటిష్ సంస్థ వొడాఫోన్ గ్రూప్ సిఇఒ నిక్ రీడ్ భారత జాయింట్ వెంచర్లలో (వోడాఫోన్ ఐడియా) తాను ఇకపై పెట్టుబడి పెట్టబోనని జూలై 23న స్పష్టం చేశారు. మరోవైపు కుమార్ మంగళం బిర్లా వోడాఫోన్ ఐడియా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

Voda Idea Q1 net loss widens to Rs 7312.9 crore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News