Home తాజా వార్తలు వొడాఫోన్ ఐడియా నష్టం రూ.6,438 కోట్లు

వొడాఫోన్ ఐడియా నష్టం రూ.6,438 కోట్లు

Vodafone Idea

 

న్యూఢిల్లీ: డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో వొడాఫోన్ ఐడియా దాదాపు రూ.6,438 కోట్లు నష్టపోయింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ నష్టం రూ.5004 కోట్లుగా ఉంది. ఎజిఆర్(సర్దుబాటు స్థూల ఆదాయం) బకాయిల భారం కారణంగా సంస్థ నష్టాలు చవిచూస్తోంది. సంస్థ ఆర్థిక వ్యయాలు, ఆస్తుల అధిక క్షీణత ప్రభావం సమస్యగా మారింది. 2019 అక్టోబర్ డిసెంబర్ కాలంలో మొత్తం ఆదాయం రూ.11,380 కోట్లతో 5 శాతం పడిపోయింది. గతేడాదిలో ఆదాయం రూ.11,982 కోట్లుగా ఉంది. ఈమేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

కంపెనీ ఆర్థిక వ్యయాలు రూ.3,722 కోట్లతో 30 శాతం పెరిగాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వానికి ఎజిఆర్ బకాయిల చెల్లించాల్సి ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.50,922 కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ రవీందర్ టక్కర్ మాట్లాడుతూ, ఎజిఆర్, ఇతర విషయాల్లో ప్రభుత్వం నుంచి ఊరట కోసం తాము నిర్విరామంగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. రివ్యూ పిటిషన్ తోసిపుచ్చిన అనంతరం తాము సుప్రీంకోర్టు గడువు పెంపు కోసం ప్రయత్నించామని అన్నారు. కంపెనీ రూ.53 వేల కోట్ల ఎజిఆర్ బకాయిలు ఉన్నాయి.

Vodafone Idea losses widen to Rs 6,438.8 cr in December