Home Default రూ.348 ప్లాన్‌లో 1జిబి డేటా పొడగింపు..

రూ.348 ప్లాన్‌లో 1జిబి డేటా పొడగింపు..

Vodafone-offer

ఈ సంవత్సరం ఆగస్టులో ప్రముఖ టెలికాం సంస్థ అయిన వొడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.348 ప్యాక్ ఆఫర్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే. ఇపటి వరకు ఈ ఆఫర్ ద్యారా వినియోగదారులకు రోజుకు 1జిబి నెట్ మాత్రమే లభించేది. ఇప్పుడు ఏకంగా రోజుకు 2జిబి డేటా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వొడాఫోన్ సంస్థ ప్రకటించింది. ఈ ప్లాన్ టారీఫ్ దేశంలో ఉన్న సర్కిళ్లను బట్టి మారనుంది. ఈ ప్లాన్ ను ఉపయోగిస్తున్న వినియోగదారులకు అన్‌ లిమిటెడ్ లోకల్ మరియు ఎస్‌టిడి కాల్స్‌చేసుకోవచ్చు. వాటికి రోజుకు 250 నిమిషాలు, వారానికి ఒక్క వేయి నిమిషాల వరకు కాల పరిమితి ఉండనుంది. ఈ ఆఫర్ ను 28రోజుల వరకు వినియోగదారులు వాడుకోవచ్చు.