Home కామారెడ్డి స్వచ్చందంగా 15 రోజుల పాటు చిన్న ఎక్లారా గ్రామంలో లాక్‌డౌన్

స్వచ్చందంగా 15 రోజుల పాటు చిన్న ఎక్లారా గ్రామంలో లాక్‌డౌన్

Voluntary lockdown in chinna eklara for 15 days

 

కామారెడ్డి: మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రామస్తులంతా కలిసి తీర్మానించుకుని స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకున్నారు. 15 రోజుల పాటు ఎవ్వరు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, కిరాణ సామగ్రి తదితర వాటికి సాయంత్రం వేళలో ఒక గంట, రెండు గంటలు మాత్రమే అవసరమైన వారు ఇంటిలో నుంచి ఎవరైనా ఒక్కరే బయటకు రావచ్చని గ్రామస్తులు పేర్కొన్నారు. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో గ్రామస్తులంతా కలిసి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒకేరోజు 40కి పైగా కేసులు ఆ గ్రామంలో పెరుగడంతో గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

పక్కనే గల మహారాష్ట్రలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్టా ఎవరి జాగ్రత్తల్లో వారుండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, మద్నూర్ మండలంలో కూడా ఇటీవల కేసులు పెరుగుతుండటంతో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్న ఎక్లారా సర్పంచ్ భీం రావు మాట్లాడుతూ గ్రామంలో వరుసగా రెండు రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో గ్రామస్తులంతా ఎవరి ఇండ్లకు వారే పరిమితమయ్యారని, స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని గత కొన్ని రోజులుగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. 15 రోజుల పాటు ఎవరు ఎవరిని కలవరని, దీంతో కరోనా మహమ్మారిని తరమికొట్టవచ్చని పేర్కొన్నారు.

Voluntary lockdown in chinna eklara for 15 days