Saturday, April 20, 2024

అభివృద్ధి కోసం కారుకు ఓటు

- Advertisement -
- Advertisement -

Vote for car for Hyderabad development

 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఈ డిసెంబర్‌లో జరుగుతున్నా ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ సారి జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రం ఏర్పడక ముందు అస్తవ్యస్తంగా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియని పరిస్థితి నుండి స్థానిక ఎన్నికలు క్రమబద్ధంగా జరిగే ఏర్పాట్లు జరిగాయి. అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేసినట్టే తెలంగాణ పట్టణాలను, గ్రామాలను నిర్లక్ష్యం చేశారు వలస పాలకులు. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేశారు. హైదరాబాద్ నగరపాలక సంస్థ, మేయర్‌గా, చైర్మన్‌గా తెలంగాణకు చెందిన వారే ఉన్నా పాలించే పార్టీ మాత్రం వలస పాలకుల చేతుల్లో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం మాత్రమే. మునిసిపల్ చైర్మన్, ఎంఎల్‌ఎలు, మంత్రులైనా సరే వలస పాలకుల కనుసన్నల్లో నడిచేది.

అందువల్ల హైదరాబాద్ మహానగరం కాలుష్యమైంది. ఒకప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తుంటే చల్లగా, హాయిగా ఉండేది. కానీ కొంత దూరం నడిస్తేనే చెమటలు కారి అలసిపోయేంత ఎండా హైదరాబాదు పాలయింది. బస్ స్టాపు లో నిల్చుంటే వాహనాల పొగతో కాలుష్యం, దుమ్ము ధూళిమయమైంది. ఇక్కడ చెరువులు, కుంటలు, తోటలు అక్రమాలకు గురయ్యాయి. పార్కుల నగరంగా ప్రసిద్ధి చెందిన మహానగరం చల్లగాలిని నోచుకోని స్థితికి వచ్చింది. నగరాన్ని కాంక్రీటు చేయడం వల్ల భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లాయి. దాంతో కూడా వేడి పెరిగింది. చెట్లు నరకడంతో కాలుష్యం పెరిగింది.

మూసీనదితో పాటు హుస్సేన్ సాగర్ కాలుష్యపు విషకల్లమయమైంది. ఉద్యోగాలు తెలంగాణేతరుల పాలయ్యాయి. మంచి నీరు కరువు, సాగు నీటి కరువు, విద్యుత్ కొరత ఇలా అనేక సమస్యలతో హైదరాబాద్ నగరం తల్లడిల్లుతున్న పరిస్థితి. తెలంగాణకు, హైదరాబాద్‌కు రావాల్సిన పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోయిన దుస్థితి. పెరుగుతున్న నగరం, పెరుగుతున్న వసతులతో ప్రజల ఇక్కట్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న హైదరాబాద్ అభాగ్య నగరంగా అనుభవిస్తుంది . 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే హైదరాబాద్ బాధను అర్థం చేసుకున్నారు కెసిఆర్.

ప్రజల ఇక్కట్లను మననం చేసుకున్నారు. దేశంలో ఐదవ మహా నగరంగా ఉన్న భాగ్యనగరం అభాగ్యనగరం కావడం అతనికి నచ్చలేదు. తెలంగాణతో పాటు మహా నగరాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. కెటిఆర్ నాయకత్వంలో గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కెటిఆర్‌కు ఐటి శాఖలో పాటు మునిసిపల్ శాఖమంత్రి బాధ్యతలొచ్చాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి పథకాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ను మార్చడానికి కంకణబద్ధుడయ్యారు. ఇది వరకటి ప్రభుత్వాలు విస్మరించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్ ఇమేజీని పెంచడానికి అహర్నిశలు కృషి చేశారు. తెరాస ప్రభుత్వం బంగారు తెలంగాణ నిర్మాణంతో పాటు హైదరాబాద్‌ను విశ్వ నగరం చేయడంలో నిమగ్నమై ఉంది .

ఇందులో భాగంగా ప్రపంచంలోని ఏ మూల నుండి వచ్చిన పౌరులైనా సరే ఈ నగరంలో సుఖవంతంగా జీవించడానికి అవసరమైన అన్ని వసతులను కల్పించడం జరుగుతున్నది. ఇంతవరకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు నివసించడానికి యోగ్యమైన స్థలంగా బెంగళూరును భావించేవారు. గత ఏడేళ్లుగా హైదరాబాద్ నగరం అభివృద్ధి గురించి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల హైదరాబాద్ నగరం నివాసయోగ్యమైన స్థలంగా భావిస్తున్నారు. కోతలు లేని కరెంటు, స్వచ్ఛమైన మంచి నీటి సరఫరా, గృహ నిర్మాణం ఇతర విషయాల్లో పర్మిషన్ లభించడానికి సులభతరం చేసిన చట్టాలు, త్వరగా పర్మిషన్ లభించడంలాంటి అనేక ప్రభుత్వ చర్యల వల్ల ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు గాని, విదేశస్థులుగాని ఇక్కడ స్థిర నివాస మేర్పరచుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు.

విదేశీ పెట్టుబడిదారులే కాకుండా ఈ దేశ వివిధ రాష్ట్రాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ నాలుగైదేళ్లుగా హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోనూ ఐటి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. వేలాది మంది యువకులు ఈ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొంది బతుకుదెరువు మార్గాన్ని ఇక్కడ చూసుకుంటున్నారు. ఐటి పరిశ్రమతో పాటు ఫార్మా హబ్ గాను హైదరాబాద్ పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. టిఎస్‌పిఎస్‌సి ద్వారా కూడా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చి, 30 నుంచి 40 వేల పోస్టులు ఇప్పటికే భర్తీ అయ్యాయి. గత నాలుగైదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తదితరమైన చర్యల వల్ల మొత్తం దేశం హైదరాబాద్ వేపు చూస్తుంది. హైదరాబాద్ విశ్వనగరం కావడానికి తీవ్ర ప్రయత్నాలు, తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్‌యస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది .

హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించడానికి కాలుష్య రహిత నగరంగా చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలిచ్చే దిశగా వేడివేడిగా పరుగెడుతున్నాయి. నత్తనడక నడుస్తున్న మెట్రో నిర్మాణానికి తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతమైన పనులన్నీ వేగంతో పూర్తియ్యాయి. దాదాపు రెండు సంవత్సరాలుగా భారతదేశంలోనే అతిపెద్ద దూరం నడిచే, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండే మెట్రో రైల్ నడుస్తున్నది. రోజు లక్షలాది మంది ఇందులో పయనిస్తూ కాలుష్యభారం నుండి దూరమవుతున్నారు. రోజు వసూలయ్యే కలెక్షన్ విషయంలోనూ ఇది నెంబర్ వన్ స్థానంలోనే వుంది. హైదరాబాద్ మెట్రో తెలంగాణకే గర్వకారణం. కాలుష్యం తగ్గించే చర్యల్లో భాగంగా కోట్లాది మొక్కలతో రాష్ట్రమంతా హరిత హారం పథకం అమలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ పచ్చదనం పెంచడంతో రోడ్ల మార్గంలో చేలు పేచీ చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ లో ఉష్ణోగ్రత తగ్గడానికి హరితహారం, చెట్ల పెంపకం, ప్రాజెక్టులతో భూమి తయారై భూగర్భ జలాలు పెరగడం ఏంతో ఉపయోగపడుతున్నాయి.

మూసీ నది ప్రక్షాళన, హుస్సేన్ సాగర్ నీటి కాలుష్య ప్రక్షాళన లాంటివి తెరాస ప్రభుత్వం వల్ల తప్ప మరెవరితోనూ సాధ్యం కాదు. అక్రమ కట్టడాల తొలగింపు క్రమబద్ధీకరణ, నాళాలపై పర్మిషన్ లేకుండా కట్టిన భవనాల తొలగింపు చర్యలతో హైదరాబాద్‌లో వర్షాలు పడ్డప్పుడు, వరద బాధకు గురైయ్యే స్థితి దూరమవుతున్నది. ఈ పని ఇప్పటికే ప్రారంభమైనా పూర్తి ఫలితాలు రావడానికి మరికొంత కాలం పడుతుంది. చినుకు పడితే చాలు రోడ్లు చెరువులయ్యే పరిస్థితి కారకులు అక్రమ అనుమతిలేని, ముంపు ప్రాంతాల్లోనూ ఇండ్లు కట్టుకోవడానికి అనుమతులు జారీ చేసిన లేదా చూస్తూ కూర్చున్న గత ప్రభుత్వాలే కారణం తప్ప టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదు. జరిగిన తప్పులను, అక్రమాలను సరి చేయడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత నాలుగైదు ఏండ్లుగా తీవ్రమైన ప్రయత్నాలే చేస్తున్నది.

అన్నపూర్ణ క్యాంటీన్లు , యాచక గృహాలు, విద్యార్థులు, యువకులు, సీనియర్ సిటిజెన్లకు లైబ్రరీలు, ఉద్యోగాలకు భరోసా, బస్తీ దవాఖానాలు, షీ టీమ్స్ సేవలు, చెరువుల సుందరీకరణ, రింగ్ రోడ్స్, నేషనల్ హై వే, లింక్ రోడ్లు ఇలా హైదరాబాదును విశ్వనగరంగా మార్చే ప్రయాణంలో తెరాస ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. నగరంలో ప్రజలను వదలకుండా ఏదో విధంగా సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి ఆర్థిక సాయం చేస్తున్నది. పారిశ్రామికవేత్త నుంచి రిక్షాలాగే కార్మికుని వరకు అందరికీ తోడూనీడై నిలుస్తున్నది. గత ఏడు సంవత్సరాల నుండి టిఆర్‌ఎస్ పాలన, గత ఐదేళ్ల టిఆర్‌ఎస్ మేయర్ జిహెచ్‌ఎంసి పాలనను దాదాపు కోటి మంది జిహెచ్‌ఎంసి ప్రజలు చూశారు. అందుకనే ప్రతి ఎన్నికలోనూ ప్రజలు తిరుగులేని మెజారిటీతో టిఆర్‌ఎస్ ను ఆశీర్వదించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ అదే పునరావృతమవుతుందనడంలో సందేహం లేదు.

ఈ ఎన్నికలో టిఆర్‌ఎస్‌తో తలపడనున్న బిజెపి, కాంగ్రెస్ చరిత్ర హైదరాబాద్ ప్రజలకు తెలియంది కాదు. గతంలో పెరిగిన మత కలహాలకు, అభివృద్ధి నిరోధక కార్యక్రమాలకు ఈ పార్టీలే కారణమన్న సంగతి అందరికీ తెల్సిందే. కాంగ్రెస్ తన బరువును తానే మోయలేక ఈడిగల పడుతుంటే బిజెపి దుబ్బాక ఉపఎన్నికలు గెలుపును బలుపుగా భావించి పగటి కలలు కంటుంది. ఈ పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్టాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. మత సామరస్యం కరువై దాడులు, అశాంతిమయమయ్యాయి. టిఆర్‌ఎస్ సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శం. ఏదేమైనా హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యరహిత, సుందర నగరంగా, ఉపాధి అవకాశాల కేంద్ర బిందువుగా, ఐటి హబ్‌గా పారిశ్రామిక కేంద్రంగా, దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి బిజెపి అసలే చాలదు. వాళ్లకు మనిషి కంటే మతమే ముఖ్యం. కాంగ్రెస్‌ను ఇది వరకు చూశారు. అందుకే టిఆర్‌ఎస్ గెలుపు అనివార్యమైంది. కెసిఆర్, కెటిఆర్‌ల ఆవశ్యకత మరి అవసరమైంది. ఈ సంగతి ప్రజలకు బాగా తెలుసు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News