Home హైదరాబాద్ ఆన్‌లైన్‌లో ఓటు వేసి గెలిపించండి

ఆన్‌లైన్‌లో ఓటు వేసి గెలిపించండి

సోనీ ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ టాప్-5 రేవంత్ విజ్ఞప్తి 

Vote In Online For Sony's Indian Idol finalist in  Top-5

సోమాజిగూడ: దేశవ్యాప్తంగా అద్భుతమైన గాయకులను గు ర్తించేందుకు సోనీ టివి చానల్ నిర్వహిస్తున్న “ఇండియన్ ఐడల్‌”లో తెలుగు కుర్రాడు టాప్ -5లో నిలిచాడు. ఏప్రిల్ 2న జరిగే ఫైనల్‌లో తనకు మద్ధ్దతు పలికి ఆన్‌లైన్ ద్వారా ఓటు వేసి గెలిపించాలని విజ్ఙప్తి చేశాడు.  బాహుబలి, సుప్రీం, ఓఏ నమో వెంకటేశాయ వంటి  చిత్రాలలో ప్లేబ్యాక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు గాయకుడు విఎల్ రేవంత్ ఇండియన్ ఐడల్‌లో టాప్ -5కి చేరకున్నాడు. మొదటి సారి నగరానికి విచ్చేసిన సందర్భంగా బుధవారం సోమాజిగూడలోని ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 ఇండియన్ ఐడల్ సిజన్ -9 తనకు ఓటు వేసి గెలిపించాలని తెలుగు ప్రజలకు కోరారు.  తనకు హిందీ బాష సరిగా రాకున్న పోటీల్లో మొదటి నుంచి ఆనంద్ శర్మ, అనూష్ వంటి వారు ముంబాయిలో ఎంతో ప్రోత్సాహాన్ని అందించడం వల్లే టాప్ -5కి చేరుకోగలిగానని అన్నారు. అంతే కాకుండా తెలుగు చలనచిత్ర రంగంలోని తోటి గాయకులు, సంగీత దర్శకులు, ఇతరుల ప్రోత్సాహం కూడా మరువలే నిదన్నారు. వచ్చేనెల 2వ తేదీన జరిగే ఫైనల్, అంతక ముందు జరిగే పోటీల్లో తన ప్రదర్శనను చూసి ఓటు వేసి తన గెలుపులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతు నివ్వాలనుకునే వారు ఆదివారం రాత్రి 8 నుంచి సోమవారం 7 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఓటు వేయవచ్చునని తెలిపారు. www.indianidol.sonylive.com వెబ్‌సైట్‌లో సోని లైవ్ యాప్ ద్వారా ఓటు వేయవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు గాయకులు ఘనంగా సన్మానించారు.