Home తాజా వార్తలు ఓటేసిన ప్రముఖులు

ఓటేసిన ప్రముఖులు

VOTINGహైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బాబు కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణి తదితరులు ఓటేశారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి లింగంపల్లిలోని 24వ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.