Home ఖమ్మం రోడ్డు ప్రమాదంలో విఆర్‌ఓ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో విఆర్‌ఓ దుర్మరణం

Road Accident

ఖమ్మం : బైక్ పై వెళ్తున్న విఆర్‌ఓను బస్సు ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే  మృతి చెందిన సంఘటన జిల్లాలోని తల్లాడ మండల కేంద్రంలోని కొత్తగూడెం రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. తల్లాడ మండలం బాలపేటకు చెందిన విఆర్‌ఓ కొంగూరి త్రిమూర్తులు  తల్లాడ నుంచి బైక్ పై బాలపేట వెళ్తున్నాడు. భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు తల్లాడలోని కొత్తగూడెం రోడ్డులో కోల్డ్‌స్టోరేజీ వద్ద బైక్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రిమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఖమ్మం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

VRO Dies In Road Accident In Khammam District