Thursday, March 28, 2024

చేసిన తప్పులే చేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

VVS Laxman responds to Pujara and Ajinkya Rahane failures

వివిఎస్.లక్ష్మణ్

ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెల వైఫల్యాలపై భారత మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ స్పందించాడు. వీరిద్దరూ చేసిన పొరపాట్లను పదేపదే చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. అందుకే వీరు వైఫల్యాలు చవిచూస్తున్నారన్నాడు. త్వరగా పరుగులు చేయాలన్న ఆతృతతో తప్పులు చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇంటాబయటా వస్తున్న విమర్శలు వీరిపై ఒత్తిడిని పెంచతుందని, దాని నుంచి బయటపడేందుకు భారీగా పరుగులు చేయాలనే తొందరలో చేజేతులా వికెట్లను పారేసుకుంటున్నారన్నాడు. ఇలాంటి సమయంలో బ్యాటింగ్ కోచ్, ప్రధాన కోచ్, కెప్టెన్‌లు వీరికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. కొంత కాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తుండడంతో వీరిని తొలగించాలనే డిమాండ్ జోరందుకుందని, ఇలాంటి స్థితిలో విపరీత ఒత్తిడికి గురవుతున్నారని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News