Friday, March 29, 2024

మృతదేహాలకు ఎంజిఎంలో శవపరీక్ష పూర్తి…

- Advertisement -
- Advertisement -

post-mortem

వరంగల్: వరంగల్‌ రూరల్‌ జిల్లా గొర్రెకుంటలో బావి నుంచి వెలికితీసిన తొమ్మిది మృతదేహాలకు  ఎంజిఎం ఆస్పత్రిలో శవపరీక్ష పూర్తి అయింది. ఈ ఘటనపై పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. షకీల్ మృతుహాన్ని బంధువులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గొర్రెకుంట బావిలో శవాలు బయటపడడం జిల్లాలో కలకలం రేగింది. ఒకే బావిలో అన్ని మృతదేహాలు దొరకడం అనుమానాలు తావిస్తోంది. అయితే ఇప్పటివరకు మృతుల సెల్ ఫోన్లు మాత్రం లభించలేదు.

 ఈ కేసులో మృతుల సెల్ ఫోన్స్ దొరికితే మిస్టరీ విడుతుందని పోలీసులు చెబుతన్నారు. బుధవారం రాత్రి 10గంటల తర్వాత మసూద్ కుటుంబసభ్యుల సెల్ ఫోన్ స్వీచాప్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో వరంగల్ బావి మృతుల్లో సెల్ ఫోన్ కీలకంగా మారింది. దీంతొ పోలీసులు సెల్ ఫోన్లను గుర్తించే పనిలో పడ్డారు. ఒకే బావిలో గురువారం 4 మృతదేహాలు, శుక్రవారం మరో 5 తొమ్మిది మంది వలస కూలీల మృతదేహాలు బయటపడ్డాయి. అందులో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, ఇద్దరు బిహార్‌, ఒకరు త్రిపుర వాసిగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Warangal Dead Bodies Post Mortem Completed in MGM
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News