Saturday, April 20, 2024

యంగ్ టైగర్ ఎన్‌టిఆర్‌కు వార్నర్ బర్త్‌డే గిఫ్ట్

- Advertisement -
- Advertisement -

Warner Birthday Gift for Young Tiger NTR

 

సిడ్నీ: కొంత కాలంగా టిక్‌టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ మరోసారి హాట్ టాపిగ్ మారాడు. ఈసారి యంగ్ టైగర్, జూనియర్ ఎన్‌టిఆర్‌కు అరుదైన బర్త్‌డే గిఫ్ట్‌ను అందించాడు. ఎన్‌టిఆర్ అభిమాని కోరికను మన్నించి అరుదైన వీడియోతో అలరించాడు. జూనియర్ ఎన్‌టిఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలోని పాటకు డేవిడ్ వార్నర్, అతని భార్య క్యాండిన్ టిక్‌టాక్ చేసి దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్‌టిఆర్, కాజల్ ఆడిపాడిన ఈ పాటకు తమవైన స్టెప్పులతో వార్నర్ దంపతులు అదరగొట్టారు.

తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ రోజు అద్భుతంగా ఉండాలి. మేము నీ పాటపై డ్యాన్స్ చేసేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ నీ డ్యాన్స్ చాలా అద్భుతం. నీలాగా మేము చేయలేక పోయాం అంటూ వార్నర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొంతకాలంగా వార్నర్ తన భార్య, కూతురుతో కలిసి తెలుగు, తమిళ సినిమాలకు సంబంధించిన పాటలపై టిక్‌టాక్ వీడియోలు రూపొందిస్తూ అభిమానులను కనువిందు చేస్తున్నాడు. అల వైకుంఠపురంలోని రెండు పాటలకు వార్నర్ చేసిన డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. తాజాగా జనతా గ్యారేజ్ పాటపై కూడా వార్నర్ ఇరగదీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News