Friday, April 26, 2024

అభిమాని అడిగిన ప్రశ్నకు వార్నర్ ఫన్నీ రిప్లై

- Advertisement -
- Advertisement -

Warner funny reply to the his fans comments

 

హైదరాబాద్ : ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత డేవిడ్ వార్నర్ ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌బై చెప్పనున్న సంగతి తెలిసిందే. అధికారికంగా వార్నర్ గుడ్‌బై చెప్పినట్లు ఎక్కడ వార్తలు రాకపోయినప్పటికీ.. సెకండ్‌ఫేజ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లు మినహా మిగతా ఏ మ్యాచ్‌లోనూ వార్నర్ ఆడలేదు. వార్నర్ స్థానంలో రాయ్‌ను ఆడించడం.. అతనికి జోడీగా సాహా, అభిషేక్ శర్మలు ఓపెనింగ్ చేశారు. ఈ విషయంతో వార్నర్ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇకపై ఆడడనేది మరింత క్లియర్‌గా తెలిసొచ్చేలా చేసింది. వచ్చే ఐపీఎల్ మెగా వేలంలో వార్నర్ కచ్చితంగా వేరే టీమ్‌కు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ఫ్యాన్స్ మాత్రం డేవిడ్ వార్నర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ను వదిలిపెట్టి వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు వార్నర్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ” వార్నర్ అన్నా.. ఎస్‌ఆర్‌హెచ్ వదిలివెళ్లకు.. మీకు మేమున్నాం” అంటూ కామెంట్ చేశాడు. దీనికి బదులుగా వార్నర్.. కేవలం లాఫింగ్ ఎమోజీని జత చేశాడు.

అంతకముందు ఎస్‌ఆర్‌హెచ్‌తో తన బంధం ముగిసిదంటూ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్వేగభరిత పోస్ట్ షేర్ చేశాడు. ”ఇంతకాలం మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్. ఏడేళ్లలో మీరు నాకిచ్చిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మా జట్టు వంద శాతం ప్రదర్శన చేయడంలో మీరే డ్రైవింగ్ ఫోర్స్ . మీరిచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు. ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున నా కెరీర్ అద్భుతంగా సాగింది. నేను-నా కుటుంబం మిమ్మల్ని మిస్ అవుతున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. వార్నర్ ఈ సీజ్ న్ లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాడు. దాంట్లో 195 రన్స్ చేశాడు. వాటిల్లో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఎస్‌ఆర్‌హెచ్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో వార్నర్ ముందున్నాడు. సన్ రైజర్స్ తరపున 95 మ్యాచుల్లో 49.55 సగటుతో 4014 రన్స్ చేశాడు . 2016లో వార్నర్ సారథ్యంలో హైద్రాబాద్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News