Home దునియా చెత్తతో ప్రపంచ వింతలు

చెత్తతో ప్రపంచ వింతలు

Waste to Wonder Parkన్యూ ఢిల్లీలోని ఈ పార్కు పేరు ‘వేస్ట్ టు వండర్ పార్కు’. ఈ వింత నిర్మాణాల ప్రత్యేకత ఏమిటంటే… ఇవన్నీ తయారు చేసింది చెత్తతో. పాత బల్లలు, మూలన పడేసిన టైప్ రైటర్లు, ఫ్యాన్లు, సైకిళ్లు, బైకుల విడి భాగాలు, రాడ్లలాంటి రకరకాల ఇనుప వస్తువులు ఇలా పనికిరాని వస్తువుల్నే ప్రఖ్యాత రూపాలుగా మలిచారు.

ఈ నిర్మాణాల కోసం ఇంచుమించు 150 టన్నుల వ్యర్థాల్ని ఉపయోగించారు. ఈ పార్కును ఏర్పాటు చేసింది ఇక్కడి పురపాలక సంస్థ. వ్యర్థాలతోనే అద్భుతమైన ఆకారాలుగా చెక్కాలనే ఆలోచనతో ఇక్కడి మున్సిపల్ స్టోర్ల నుంచి లోహ వ్యర్థాల్ని సేకరించింది. వాటితోనే ప్రపంచ వింతల నమూనాల్ని తీర్చిదిద్దారు. దీని కోసం కళాకారులతో పాటు 70 మంది ఆరునెలల పాటు పనిచేశారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ పార్కు కోసం సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారట.

Waste to Wonder Park