Home తాజా వార్తలు నేటి నుంచి జలమండలి ఇంటింటి సర్వే

నేటి నుంచి జలమండలి ఇంటింటి సర్వే

Water Board

 

బయటపడనున్న అక్రమ నల్లాకనెక్షన్ల బాగోతం, 150మంది సిబ్బందితో 15బృందాల ఏర్పాటు
ఇంటింటికి వెళ్లి క్యాన్ నెంబర్ ఆధారంగా సర్వే
డొమెస్టిక్ కనెక్షన్ ఉండి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భవనాలు గుర్తింపు

హైదరాబాద్ : మహానగరంలో ఇంటింటికి స్వచ్ఛమైన నీటి సరఫరా చేసే జలమండలి రెవెన్యూ పెంచుకునేందుకు చర్యలు ప్రారంభించింది. బోర్డులో చురుకైన 150మంది సిబ్బందితో ఇంటింటి సర్వే చేపట్టానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వాటర్‌బోర్డు కార్యాలయంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్వే కోసం నిర్వహించిన 150మంది సిబ్బంది 50బృందాలుగా ఏర్పడి జీఎం, డిజిఎం, మేనేజర్ల సాయంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటింటికి పూర్తి సర్వే చేసి వినియోగదారుడు నంబర్ మీటర్ వివరాలు, ఇంటి వైశ్యాలం, ఎన్నిగదులు, ఎన్ని అంతస్తులు, కనెక్షన్ కేటగిరి వంటి వాటిపై వివరాలు సేకరిస్తారు. అలాగే కనెక్షన్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలిస్తారు. ఒక వేళ డొమెస్టిక్ కనెక్షన్ ఉండి ఆభవనంలో వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తే ఆకనెక్షను కమర్షియల్ కేటగిరీలో మార్పు చేస్తారు.

ఈఇంటింటి సర్వే మొదటి డివిజన్ 5,6,7,9,10,11 పరిధిలో చేపడుతారు. తరువాత నగర వ్యాప్తంగా సర్వే నిర్వహించనున్నారు. ఈసందర్భంగా ఎండి దానకిషోర్ వివరాలు వెల్లడిస్తూ బోర్డు మొత్తం రెవెన్యూ నెలకు రూ.120కోట్లు కాగా, ఖర్చు రూ. 150కోట్లు చేరిందని, ప్రతినెల రూ. 30కోట్లు లోటు బడ్జెట్‌తో నెట్టుకోస్తుందని వివరించారు. లోటు ఉన్న బోర్డు ఆదాయం పెంచుకోవాల్సిన అవసంర ఎంతైనా ఉందని, ఈసర్వేలో భాగంగా ఎంపిక చేసిన 150మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి బోర్డు నిబంధనలకు అనుగుణంగా కనెక్షన్ ఉందా, అక్రమ నల్లాకనెక్షన్ గుర్తింపు, వాటిని రెగ్యులర్ చేయడం, నాన్ డొమెస్టిక్ కనెక్షన్ అయితే మీటరు బిగింపు, నీటి వృథా అరికట్టడానికి అవగాహన కల్పించడం వంటి వాటిపై సర్వే చేపట్టాలని సూచించారు.

నీటి వృథాను ఆరికడితే బోర్డుకు మరింత ఆదాయం వస్తుందని, బోర్డు పరిధిలో దాదాపు 10.06 లక్షల కనెక్షన్లు ఉండగా వాణిజ్య కనెక్షన్లు మాత్రం 30వేలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల జీవన విధానం చాలామారింది, నగరంలో వాణిజ్య కార్యకలపాలు పెరిగాయి. గతంలో డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని ప్రస్తుతం వాటిని వాణిజ్య సముదాయాలు చేపడుతన్నారు. ఈసర్వేలో అక్రమ నల్లా కనెక్షన్ సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. సర్వే చేసే సిబ్బంది వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి, ఈసర్వే వివరాలపై విజిలెన్స్ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.

సర్వేలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించి 150 ప్రాంతాల వివరాలను తీసుకుని ఆయా ప్రాంతాల్లో కూడా వాణిజ్య కనెక్షనపై సర్వే జరుగుతుందని, జలమండలి సిబ్బంది ఇంటింటి సర్వేకు వచ్చినప్పుడు వినియోగదారులకు సహకరించాలన్నారు.శిక్షణ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ ఆజ్మీరా కృష్ణ, సిజీఎంలు, జీఎంలు,డీజిఎంలు పాల్గొన్ని పలు సూచనలు చేశారు.

Water Board Home Survey from Today