Saturday, April 20, 2024

పోలవరం కూడా క్రొత్త ప్రాజెక్టేనా!

- Advertisement -
- Advertisement -

Water Dispute Between Telangana and Andhra Pradesh

అపెక్స్ కౌన్సిల్ & కృష్ణా, గోదావరి మేనేజ్‌మెంట్ (కెఆర్‌ఎవ్‌ుబి) బోర్డు నిర్మాణాలు క్రొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రణాళిక , ఆమోదం వంటి వాటి విధులు బోర్డు ప్రతిపాదనకు అంచనావేసి సిఫారసు చేసిన తరువాత అవసరమైతే కేంద్ర జల సంఘం అభిప్రాయం తీసుకొని అనుమతులు మంజూరు చేయుట బోర్డులు కెడబ్ల్యుడిటి/జిడబ్ల్యుడిటి అవార్డుల ప్రకారం నీటి లభ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా క్రొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు సాంకేతికంగా పరిశీలించి అపెక్స్ కౌన్సిల్‌కు ప్రణాళిక అనుమతులకు పంపుట.

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత వీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి వాటి డిజైన్‌లలో తీసుకునే మూలాంశాల వలన కలిగే లాభనష్టాలకై సామాన్య ప్రజానీకానికి చర్చించే అవకాశము కలిగినది. తెలంగాణ ప్రజల పోరాటం వలన 2014లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 206 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులోకి వచ్చిన విషయము అందరికీ తెలిసిందే… ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకటనలోని విషయాలు/కారణాలు పరిశీలిస్తే అందులోని విశిష్ట లక్షణాలలో ఒకటైన నీటికి సంబంధించిన విషయము ఈ క్రింది విధంగానున్నది.

రెండు వారసత్వ రాష్ట్రాల భూభాగాలకు, నీటి వనరుల నిర్వహణ, అభివృద్ధికి యంత్రాంగాలను అందించుట కొరకు” అని ఉన్నది. పునర్విభజన చట్టంలోని 9వ భాగం (సెక్షన్ 84 నుండి 91 వరకు) & షెడ్యూల్ 9, నీటి వనరుల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించినవి. వీటి క్లుప్తంగా పరిశీలిస్తే..అపెక్స్ కౌన్సిల్ & కృష్ణా, గోదావరి మేనేజ్‌మెంట్ (కెఆర్‌ఎవ్‌ుబి) బోర్డు నిర్మాణాలు క్రొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రణాళిక , ఆమోదం వంటి వాటి విధులు బోర్డు ప్రతిపాదనకు అంచనావేసి సిఫారసు చేసిన తరువాత అవసరమైతే కేంద్ర జల సంఘం అభిప్రాయం తీసుకొని అనుమతులు మంజూరు చేయుట బోర్డులు కెడబ్ల్యుడిటి/జిడబ్ల్యుడిటి అవార్డుల ప్రకారం నీటి లభ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా క్రొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు సాంకేతికంగా పరిశీలించి అపెక్స్ కౌన్సిల్‌కు ప్రణాళిక అనుమతులకు పంపుట.

ఇక కృష్ణానదిపై నిర్మించే ప్రాజెక్టుల విషయానికొస్తే, అసలు అపెక్స్ కౌన్సిల్‌కు అనుమతి ఇచ్చే అధికారం ఉంటుందా అనేది సందేహమే! పునర్విభజన చట్టం సెక్షన్ (89) ప్రకారం ప్రస్తుతం ఉన్న బ్రిటీష్ కుమార్ ట్రిబ్యునల్ కాల పరిమితిని పెంచిన విషయము తెలిసిందే. ట్రిబ్యునల్ కాల పరిమితిని పెంచిన విషయము తెలిసిందే. ట్రిబ్యునల్ విచారణలు జరుగుతున్నప్పుడు/నిర్మించిన/ నిర్మిస్తున్న/నిర్మించబోయే ప్రాజెక్టుల వివరాలకు తెలియపరచాలె. ట్రిబ్యునల్‌లో తెలియపరచకుండా అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఎలా మంజూరు చేస్తుంది అనేది ప్రశ్నార్థకము. క్రొత్త ప్రాజెక్టు నిర్వచనము ఈ క్రింది అంశాల ఆధారంగా దేనికి వర్తిస్తుందో నిర్ణయించిన అవసరమున్నది.

1) కృష్ణా మరియు గోదావరి ట్రిబ్యునల్ అవార్డులలో పేర్కొనని ప్రాజెక్టులా? 2) పరీవాహక రాష్ట్రాల పరస్పర ఒప్పందం కుదుర్చుకొని ట్రిబ్యునల్ అవార్డులలో పొందుపరిచి ఆలస్యంగా నిర్మిస్తున్న లేదా నిర్మించబోయే ప్రాజెక్టులా? 3) పునర్విభజన చట్టం కంటే ముందే సర్వే/డిపిఆర్‌లు చేపట్టడానికి ఆదేశాలు ఇచ్చిన ప్రస్తుతం చేపడ్తున్న ప్రాజెక్టులా? 4) ప్రధాన నది నుండి నీటిని కాల్వల పునర్నిర్మాణం ద్వారా సామర్థ్యాలను పెంచిన ప్రాజెక్టులా?

5) డిపిఆర్ ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులలో సిసిఎ/నీటి నిల్వ/ నీటి వినియోగం పెరుగుదల/ నిర్మాణ స్థల/ కాల్వ పంపిణీ నెట్‌వర్క్ అమరిక లేదా పరిమాణంలో/ ప్రాజెక్టు పరిమితులు వంటి ప్రయోజనలాలో ఉన్న ప్రాజెక్టులా? 6) కేంద్ర జలసంఘం డిఒడబ్ల్యూఆర్, ఆర్‌డిఆర్ శాఖ వారు గమనించినట్లుగా, సాంకేతిక సలహా కమిటీ అంగీకరించినా, కేంద్ర జలసంఘం సాంకేతికఆర్థికంగా అంచనా వేయబడిన ఏ ప్రాజెక్టు అంచనా అయినా విభజనకు ముందు లేదా తరువాత ఉద్భవించిందా అనే దానిలో సంబంధం లేకుండా క్రొత్త ప్రాజెక్టుగా పరిగణించాలా?

7) సవరించిన అంచనాలు అసలు అంచనాల కంటే 15 శాతమే ఎక్కువ పెరిగి ప్రణాళికా సంఘం క్రొత్త ప్రాజెక్టులా? అసలు క్రొత్త ప్రాజెక్టు నిర్వచనము ఎవ్వరు ఇవ్వాలి. నిర్వచనము అనేది దేశంలోని అన్ని నదులపై నిర్మించే/ నిర్మించబోయే ప్రాజెక్టులకు వర్తించేలా ఉండాలి కదా. కెఆర్‌ఎంబి/ జిఆర్‌ఎంబి లు ఏ ప్రాతిపదిక ఇస్తాయి. అన్ని రాష్ట్రాల ప్రమేయంలో జాతీయ జల వనరుల మండలి లాంటి సంస్థ ఇవ్వాల్సుంటుంది. ఇటీవల జరిగిన కెఆర్‌ఎంబి/జిఆర్‌ఎంబి సమావేశాలలో చర్చించిన అంశాల ఆధారంగా పోలవరం కూడా క్రొత్త ప్రాజెక్టు ఎలాగ అంటే

1) గోదావరి ట్రిబ్యునల్ అవార్డు (జిడబ్ల్యూడిటి) ప్రకారం పోలవరం 36 లక్షల క్యూసెక్కుల వరదుకు డిజైన్ చేయాలె కానీ 50 లక్షల క్యూసెక్కుల వరదుకు డిజైన్ చేస్తున్నారు. 2) అంచనా వ్యయం దాదాపు 100 శాతం పెరిగినది.
3) ప్రాజెక్టు క్రింద సాగునీటి ప్రాంతం పెరిగినది కదా. అంటే నీటి వినియోగం/ సామర్థ్యం పెరిగినట్లే కదా. కాలువల సామర్థ్యం పెంచుతున్నారు కదా. ఇలా ఎన్నో అంశాల ఆధారంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా క్రొత్త ప్రాజెక్టే, అందువలన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా ఆపాలి.

కె. వేణుగోపాల్ రావు- (రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News