Thursday, April 25, 2024

వాటర్ హర్వెస్టింగ్ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Water harvesting construction says KTR

హైదరాబాద్: కార్పొరేషన్ పరిధిలోని ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై ప్రధాన దృష్టి సారించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు మంత్రి కెటిఆర్ తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల అభివృద్ధిపై మంత్రి కెటిఆర్ సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్పొరేషన్ల పరిధిలోని శ్మశాన వాటికలు, పార్కులు, జంక్షన్ల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చివేయాలని కోరారు. కరీంనగర్, నిజామాబాద్ పట్టణాల వాటర్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రెండు కార్పొరేషన్లకు వాటర్, ఎనర్జీ ఆడిటింగ్ 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రెయిన్ వాటర్ హర్వెస్టింగ్ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌ఎలు రసమయి బాలకిషన్, గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్ తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News