Home తాజా వార్తలు శ్రీశైలంకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

శ్రీశైలంకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Water inflow of lakh cusecs into srisailam project

 

నాగర్‌కర్నూల్ : శ్రీశైలం జలాశయానికి లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. ఎగువ జూరాల నుంచి పదహారు గేట్లు ఎత్తడం ద్వారా 64వేల 992 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 34వేలు 301 క్యూసెక్కుల మేర మొత్తం లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 215.807 టిఎంసిలకు గానూ 41.1060 టిఎంసిలకు చేరుకుంది. అడుగులలో 885 అడుగులకు గానూ 820.40 అడుగులకు శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ నమోదైంది. తెలంగాణ ఎడమ గట్టు జల విద్యుత్ ద్వారా 7063 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. శ్రీశైలంకు సుంకేసుల నుంచి తుంగభద్ర నది ప్రవాహం తగ్గడంతో ఆదివారం అధికారులు ఒక్క గేటును కూడా మూసివేశారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నారాయణపూర్ నుంచి 79వేల 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా జూరాల అధికారులు 16 గేట్లను ఎత్తి 64 వేల 992 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

కృష్ణాబేసిన్‌లో ప్రాజెక్టులలో నీటి నిల్వ
కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులలో క్రమక్రమంగా నీటి నిల్వ పెరుగుతుంది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో కర్ణాటకలోని అలమట్టి ప్రాజెక్టులో 129.72 టిఎంసిలకు గానూ 98.9 టిఎంసీలు నీరు నిల్వ ఉండగా 52 వేల 247 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో , 52 వేల 247 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతుంది. నారాయణపూర్ ప్రాజెక్టులో 37.64 టిఎంసిలకు గానూ 34.61 నీరు నిల్వ ఉండగా 60 వేల 185 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 54 వేల 80 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టులో 9.66 టిఎంసిలకు గానూ 9.14 టిఎంసిల నీరు నిల్వ ఉండగా 79.700 ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా ఔట్‌ఫ్లో లక్షా 1056 క్యూసెక్కులుగా నమోదైంది.

అదే విధంగా శ్రీశైలం ప్రాజెక్టులో 215.807 టిఎంసిలకు గానూ 41.1060 టిఎంసిలుగా నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు నమోదు కాగా ఔట్‌ఫ్లో 7395 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 312.045 టిఎంసిలకు గానూ 169.32 టిఎంసిల నీరు నిల్వ ఉంది. 5465 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 933 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదు అయ్యింది. పులిచింతల ప్రాజెక్టులో 45.77 టిఎంసీలకు గానూ 44.035 క్యూసెక్కుల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 12291, ఔట్‌ఫ్లో 1016 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. కృష్ణా డెల్టా సిస్టంలో 3.07 టిఎంసీలకు పూర్తి స్థాయిలో నిండి ఉంది. ఇన్‌ఫ్లో 7147 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో అంతే మోతాదులో నమోదైంది. ఇదిలా ఉండగా కృష్ణాబేసిన్‌లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదికి వరద క్రమక్రమంగా పెరుగుతుంది.

Water inflow of lakh cusecs into srisailam project