Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) మెట్రో స్టేషన్‌లో వాటర్ లెస్ టాయిలెట్స్

మెట్రో స్టేషన్‌లో వాటర్ లెస్ టాయిలెట్స్

Toi-Lets

మన తెలంగాణ/మియాపూర్ : హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో వాటర్ లెస్ టాయిలెట్స్‌ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్‌లో వాటర్ లెస్, ఓడర్ లెస్ టాయిలెట్‌ను మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నేచర్‌సని ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ త్రీ ఇన్ వన్ ఫ్లవర్ మోడల్ వాటర్ లెస్ టాయిలెట్‌ను తీసుకువచ్చారన్నారు. ఈ టాయిలెట్ వల్ల ఎ లాంటి దుర్వాసన రావడం, శుభ్రపర్చడానికి నీటి అవసరం లేకుండా యూరిన్ నేరుగా పైప్‌లోనుంచి సంస్థ వారు ఏర్పాటు చేసిన పిట్‌కు వెళ్ళి అక్కడ యూరిన్‌ను బయోలాజికల్ ద్వారా శుభ్రం చేసి నీటిలాగా తయారు చేసి భూమిలో కలిసిపోతుందన్నారు.

ఆ శుభ్రపరిచిన నీటిని మొక్కలకు వెళ్లే విధంగా పైప్‌లైన్ కూడా ఏర్పాటు చేశారన్నా రు. ఈ యూరినల్స్ పుణేకు చెందిన ఒక అంధ సైంటిస్ట్ అయిన సుభాష్ పాటిల్ గత 4 సంవత్సరాలు పరిశోధన చేసి ఈ టాయిలెట్‌ను తయారు చేయడం జరిగిందన్నారు. సుమారు ఈ టాయిలెట్స్ నిర్మించడానికి రూ.3లక్షల ఖర్చు అవుతుందన్నారు. మహిళల కోసం కూడా వాటర్ లెస్ టాయిలెట్స్‌ను ప్రత్యేకంగా పరిశోధన చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మూడు మెట్రో స్టేషన్లలో టాయిలెట్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రానున్న రోజుల్లో మెట్రో రైల్ స్టేషన్‌లో వాటర్ లెస్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్ర మంత్రి కెటీఆర్ ఈ వాటర్ లెస్ టాయిలెట్స్‌ను చూసి అభినందించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలలో ఈ టాయిలెట్‌లను నిర్మిస్తామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ఈ వాటర్ టాయిలెట్స్ ఒక భాగమేనన్నారు.