Home భద్రాద్రి కొత్తగూడెం గోదా’వర్రీ’

గోదా’వర్రీ’

Godavari-River

నదిలో అడుగంటిన నీటి మట్టం
దర్శనమిస్తున్న ఇసుక తెన్నెలు

భద్రాచలం: గోదావరి నదీ తీరం ఎడారిని తలపిస్తోంది. నదిలో నీటిమట్టం దాదాపు అడుగంటిపోయింది. ఇసుకతెన్నులు దర్శనమిస్తున్నాయి. దీంతో తాగునీటికి సైతం కరువు ఏర్పడే దౌర్భాగ్య పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. భద్రాచలం వచ్చే భక్తులు తీర్థ స్నానాలకు సైతం నీరు లేక ఇక్కట్లుపడుతున్నారు. గత పదేళ్ళలో గోదావరి ఇలా కన్పించడం ఇదే ప్రథమం.

ఎడారిలా…
భధ్రాచలం డివిజన్ వ్యాప్తంగా సుమారు 60 కి.మీ. మేరకు గోదావరి ప్రవహిస్తోంది. గోదావరికి ఓ వైపు భద్రాచలం నియోజకవరగం ఉండగా, మరో వైపు పినపాక డివిజన్‌తో పాటు వరంగల్ జిల్లాలోని కొంత భాగం ఉంది. వేసవి కాలం మినహా మిగతా అన్ని రోజుల్లో కనీసం ఎప్పటికీ 25అడుగుల పైబడి నీరు ఉండటం పరిపాటి. అదే వర్షా కాలం నాలుగు నెలల పాటు నిత్యం 35 నుంచి 50 అడుగుల వరకు గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అది పిల్ల కాలువలా కనిపించడమే కాకుండా భద్రాచలం నుంచి విడదీయబడిన వాజేడు మండలం మొదలుకుని భద్రాచలం మండలం వరకు ఎటు చూసినా ఇసుక దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం రామాలయ ంలో సమీపంలో ఉన్న స్నానఘట్టాల వద్ద సుమారు 8 నుంచి 10 అడుగుల లోపే నీరు ఉంది. ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు వెళ్లాలంటే పడవలపై ఆధార పడే వారు కానీ ఇప్పుడు సరదాగా నడుచుకుంటూ వెళుతున్నా రు. నడుం లోతు నీళ్లు కూడా లేవు, సులువుగా నది దాటి పోతున్నాం అంటూ భక్తులు చెబుతున్నారు.

తాగునీటికి కటకట….
భద్రాచలం పట్టణంలోని సుమారు 23 కాలనీలు ఉన్నా యి. వాటిలో శివారు కాలనీలకు గోదావరి నీటి సరఫరా లేదు. ఉన్న 16 కాలనీల్లో నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం పరిస్థితిల్లో తాగునీటికి కటకట ఏర్పడింది. ఇప్పు డు రోజు విడిచి రోజు నీళ్లను విడుదల చేస్తున్నప్పటికీ రాబో యో రోజుల్లో వారానికి ఓసారి నీరు విడుదల చేయడం గగనంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే తాగునీటి కోసం ప్రజలు నరక యాతన పడుతున్నారు. శివారు కాల నీల్లోకి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. అర కొరగా సరఫరా అయ్యే నీరు ఎటూ సరిపోక ప్రజలు మిన రల్ వాటర్‌పై ఆధారపడుతూ కాలం వెళ్ల్లదీస్తున్నారు. నిత్యం గోదావరిలో తాగునీటి కోసం వెళ్లే వందలాది పశు వులు సైతం నీటి కోసం ఇసుకలో కిలోమీటర్ల మేర నడుస్తూ నరకయాతన పడుతున్నాయి. ప్రతీ ఏటా సముద్రంలో గోదావరి నీరు సుమారు 3 వేల టీఎంసీల వరకు వృథాగా కలిసిపోతుంది.

సముద్రంలో కలిసిపోయే నీటిని జాగ్రత్త చేసుకుంటే వేసవి కాలంలో ఇలాంటి ఇబ్బందులను రాకుండా చూసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇది కొంత సాధ్యపడే అవకాశం ఉంది. మరో పక్క పట్టణంలో తాగునీటి సమస్య ప్రతీ వేసవిలోనూ వెంటాడుతోంది. పట్టణ ప్రజల దాహార్థిని తీర్చేందుకు గత పదేళ్లుగా కొనసాగుతున్న తాగునీటి పథకం పనులు ఇంకా సాగింపు దశలోనే ఉన్నా యి. కాలనీలకు నిత్యం నీటిని అందించేందుకు అక్కడక్క డా ఏర్పాటు చేస్తున్న ట్యాంకులు మరికొన్ని నిర్మించి పట్ట ణంలో 24 గంటలపాటు నీటి సరఫరా అయ్యే చర్యలు చేప ట్టాలని, నీరు వాడకానికి మీటర్లు ఏర్పాటు చేసి వాడకాన్ని బట్టి బిల్లులు విధిస్తే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని, ఆదాయం సమకూరితే విద్యుత్ బిల్లు లు పోను మిగతావి చిన్న చిన్న మరమ్మత్తులు ఏర్పడినప్పుడు నిధులపై ఆధారపడకుండా వాడుకోవచ్చని అంటున్నారు

తీర్థస్నానాలకు భక్తుల ఇక్కట్లు …
పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాద్రికి భక్తుల తాకిడి నిత్యం ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు పావన గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచ రించి రామయ్య దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఇప్పు డు తీర్థస్నానం చేసేందుకు కూడా నీరు ఇబ్బందిగా మా రింది. ఈసారి వేసవి సెలువులు కావడంతో భక్తుల తాకిడి కూడా అధికంగానే ఉంది.