Friday, July 11, 2025

పుచ్చ‌కాయ తిని విత్తనాలు పడేస్తున్నారా..?

- Advertisement -
- Advertisement -

పుచ్చకాయ శరీరానికి చల్లదనం అందిస్తుంది. తీపి, రసవంతమైన చల్లని పుచ్చకాయను తినడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. పుచ్చకాయలు మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. ఇక సీజన్ లో మాత్రం ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తాయి. అయితే పుచ్చకానికి తినేటప్పుడు మనం చాలావరకు వాటి విత్తనాలను పడేస్తాము. కానీ, ఈ విత్తనాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పుచ్చకాయ విత్తనాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

పుచ్చకాయ విత్తనాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే కొవ్వులు, మెగ్నీషియం గుండె కొట్టుకోవడాన్ని నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పుచ్చకాయలో జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి శరీర అరోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పుచ్చకాయ విత్తనాలలో షుగర్ శోషణ ను నెమ్మది చేసే గుణాలు ఉంటాయి. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

పుచ్చకాయ విత్తనాలను ఎలా తినాలి?

పుచ్చకాయ విత్తనాలను ఎండలో ఆరబెట్టి తేలిగ్గా వేయించి తినవచ్చు. అంతేకాకుండా ఈ విత్తనాలను గ్రాండ్ చేసి, పొడి చేసి, స్మూథీలు, సలాడ్ లు లేదా ఓట్స్‌లో కలుపుకొని తినవచ్చు.

పుచ్చకాయ విత్తనాలు ఏ సమయంలో తీసుకోవాలి?

ఉదయాన్నే కాళీ కడుపుతో లేదా అల్పాహారంలో వీటిని తీసుకోవచ్చు. సాయంత్రం పూట ఆకలిగా అనిపిస్తే స్నాక్స్ గా కూడా తినవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News