Home తాజా వార్తలు కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

Water Release from Kondapochamma Projectసిద్దిపేట : కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. గోదావరి నీటితో బీడు భూములను ఆయకట్టుగా మార్చేందుకు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పొలాలకు ఈ నీటిని విడుదల చేశారు. ఎఫ్ డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగడి సునీతలు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి ఈ నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో గజ్వేల్, ఆలేరు మండలాల్లో కాళేశ్వరం జలాలు పారనున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని 42 చెరువులు నింపనున్నారు. గోదావరి జలాలు వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.