Home తాజా వార్తలు జలగణమన

జలగణమన

MLA-Balka-Suman

ఎంఎల్‌ఎ బాల్కసుమన్ ఆధ్వర్యంలో సామూహిక వనభోజనం, తరలివచ్చిన జనం
ప్రజలతో కలిసి మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆనందోత్సాహాలు
అపరభగీరథుడు కెసిఆర్
అంటూ నినాదాలు
మేడిగడ్డలో 7టిఎంసిలు, అన్నారంలో 4.80టిఎంసిలు
మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరుల జలహారతి
అశేష ప్రజానీకంతో బహిరంగసభ

మన తెలంగాణ/మంచిర్యాలప్రతినిధి /వరంగల్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రను తిరగరాస్తోంది. పరవళ్లు తొక్కేగోదావరి దిశను మార్చి ఎగువకు తరలిస్తోంది. మేడిగడ్డ నుంచి ఎదురెక్కి వస్తున్న గోదారమ్మ జలాలు దిగ్విజయంగా అన్నారం పంప్‌హౌజ్‌కు చేరుకున్నాయి. గత నాలుగు రోజులుగా కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజిలోకి ప్రవాహం పెరగడంతో మంగళవారం రా ష్ట్రమంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి అందజేసి బ్యారేజి వద్ద నీటిని విడుదల చేశారు. మేడిగడ్డ వద్ద గోదావరి పరవళ్లుతొక్కుతుండగా కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజికి ఇప్పటికే 4.59టిఎంసిల నీరు, 9.87 మీటర్ల మేరకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం మంచిర్యాల జిల్లాలోని సుందిళ్ల-, అన్నారం వద్ద ఏర్పాటు చేసిన కాళేశ్వ రం జలజాతర, వన భోజనాల సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

ఈ సభలో రాష్ట్ర సంక్షేమశాఖమంత్రి కొప్పుల ఈశ్వర్, అటవీ,దేవాదాయ,గృహనిర్మా ణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతల ఆరోపణలు తిప్పికొడుతూ కాంగ్రె స్ నాయకులు అడ్డంకులను ఎదుర్కొని సిఎం కెసిఆర్ కార్యదీక్షతో అపర భగీరథుడి మాదిరిగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేశారన్నారు. కోటి ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందించే వరకు సిఎం కెసిఆర్ నిద్రపోరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చూసి కాంగ్రెస్ నాయకులు సిగ్గుపడాలని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో తెలంగాణరాష్ట్రం ముందుందని సిఎం కెసిఆర్‌కు ప్రజలందరు వెన్నంటే ఉండాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు సిఎం కెసిఆర్ అద్బుతమైన ఆలోచనతో రూపుదిద్దుకుందిన ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు నీరందించే దిశగా ప్రతిపాదనలు ముందుకు సాగుతున్నాయన్నారు. మూడు సంవత్సరాల్లోనే ప్రాజెక్టును రాత్రి పగలు కష్టపడి పూర్తి చేశారన్నారు. త్వరలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద కూడా తాము ఇలాంటి జలజాతరను ఏర్పాటు చేశామని తెలిపారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు తప్పకుండా నీటిని అందించే దిశగా చూస్తామన్నారు.

చెన్నూర్ ఎంఎల్‌ఏ బాల్కసుమన్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి పూర్తిగా నిండుతుందని సిఎం కెసిఆర్ మహారాష్ట్ర సిఎంతో నదీజల్లాల గురించి ఒప్పందం కుదుర్చుకొని నీటి పంపకాల సమస్య లేకుండా చేశారన్నారు. భారతదేశానికే సిఎం కెసిఆర్ నాయకత్వం అవసరమని ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి వారి అందిం చేవరకు ముందుంటానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారుతాయని అన్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు చేసే అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. సభలో మంచిర్యాల ఎంఎల్‌ఎ దివాకర్‌రావు, ఆసిఫాబాద్ ఎంఎల్‌ఏ ఆత్రం సక్కు, రామగుండం ఎంఎల్‌ఏ కోరుకంటి చందర్, ఎంఎల్‌సిలు పురాణం సతీష్, నారదాసు లక్షణ్‌రావు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు నల్లాల భాగ్యలక్ష్మి, కోవలక్ష్మి, పుట్టమధు, గండ్ర జ్యోతి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
జనంతో పోటెత్తిన జలజాతర
అన్నారం బ్యారేజి నీటి విడుదల అనంతరం మంచిర్యాలజిల్లా సుందిళ్ల వద్ద ఏర్పాటు చేసిన జలజాతర టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు జనంతో పోటెత్తింది. చెన్నూర్ ఎంఎల్‌ఏ బాల్కసుమన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక వన భోజన కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. ఈ సందర్బంగా ప్రజలతో కలసి మంత్రులు, ఎంఎల్‌ఏలు సామూహిక వన భోజనాలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు సామర్థం 16.17 టిఎంసిలు కాగా ప్రస్తుతం 7.066 టిఎంసిల నీరు చేరింది. ప్రాజెక్టుల్లో వందమీటర్ల వరకు గోదావరి నీరు చేరుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు 96.5 మీటర్లకు మేడిగడ్డలో నీరు చేరింది. ఈ లెక్కల ప్రకారం రెండు బ్యారేజీలకు సగం నీరు చేరినట్లయింది. మిగిలిన సగం నీరు వారం రోజుల్లో చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి.

గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలు, వాటికితోడు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఇన్‌ఫ్లో కూడా భారీగానే వస్తుంది. రానున్న మూడు రోజు ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెండు ప్రాజెక్టులకు ఐదు నుండి ఆరు టిఎంసిల చొప్పున నీరు చేరితే రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కన్నెపల్లి పంప్‌హౌజ్‌లో మంగళవారం ఉదయం వరకు ఐదు మోటార్లను వెటరన్ చేసిన అధికారులు మధ్యాహ్నం నుండి నాలుగు మోటార్లనే వెటరన్ చేస్తున్నారు. గోదావరి వరద ఉధృతి భారీగా ఉంది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు నాలుగు నుండి ఐదు మీటర్ల నీటి నిల్వలు చేరుకుంటే ఆరు మోటార్‌ను కూడా వెటరన్ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.
సముద్రాన్ని తలపిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ
కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీగా ఉన్న మేడిగడ్డ సముద్రాన్ని తలపిస్తుంది. ప్రాజెక్టు నీటి సామర్థం 16.17 టిఎంసిలు ఉండగా ప్రస్తుతం 7 టిఎంసిల నీరు చేరింది. సగం నీరు ప్రాజెక్టుకు గోదావరి గ్రావిటీ నీరు చేరుకోవడంతో గోదావరి నిడివిలో 3 నుండి 5 కిలోమీటర్ల మేర నిలిచి ఉంది. 85 గేట్లతో ప్రాజెక్టును నిర్మించినందున వచ్చిన నీరు అక్కడే నిలిచిపోవడంతో నీటి నిల్వ సామర్థం పెరుగుతుండడం వల్ల ప్రాజెక్టు శిఖం పరిధి నీటితో పెరుగుతూ వస్తుంది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు మేడిగడ్డ బ్యారేజీకి 20 నుండి 25 కిలోమీటర్ల గోదావరి నిడివి ఉంటుంది. బ్యారేజీకి పూర్తిస్థాయి నీటి నిలువ చేరుకుంటే 30 కిలోమీటర్ల మేరకు గోదావరి నీరు స్టోర్ అయి ఉంటుంది. కన్నెపల్లి పంప్‌హౌజ్ వరకు నీటి నిలువ ఎక్కువగా ఉండడం వల్ల పంప్‌హౌజ్‌లో ఉన్న 11 మోటార్లను నిరంతరం వెటరన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సగం నీరు మేడిగడ్డకు చేరుకోవడం మరో మూడు టిఎంసిల నీరు చేరితో కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు మేడిగడ్డ బ్యారేజీ నీరు కనెక్ట్ అయి ఉంటుంది.
మొదలైన కాళేశ్వరం జల జాతర
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ప్రాజెక్టుకు గోదావరి నీటి వరద భారీగా చేరుతున్నందున ప్రాజెక్టుల న్నీ జలమయమైపోతున్నాయి. వచ్చిన పర్యాటకులనుండి ఎలాంటి అపశ్రుతి జరగకూడదనే ఉద్దేశంతో అధికారులు పర్యాటకులను ప్రాజెక్టుల వద్దకు అనుమతించడం లేదు. ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తరువాత ప్రాజెక్టుల నిర్మాణం తీరును చూసే అవకాశం ఉండదని వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి భారీ ఎత్తున తరలిపోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే అధికారుల ఆంక్షలు ఎక్కువగా ఉన్నందున కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లడానికి ఇబ్బందికరంగా భావిస్తున్నారు.

ఆదివారం వరంగల్ ఉమ్మడి జిల్లాలోని జనగాం నియోజకవర్గం నుండి ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 30 బస్సుల్లో పార్టీ శ్రేణులను కన్నెపల్లి, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల సందర్శనకు తీసుకెళ్లారు. అదేస్పూర్తితో మంగళవారం అన్నారం బ్యారేజీని సందర్శించడానికి జలజాతర కార్యక్రమాన్ని చెన్నూరు ఎంఎల్‌ఎ బాల్క సుమన్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆధ్వర్యంలో 15 వేల మంది పార్టీ శ్రేణులు బ్యారేజీకి చేరుకున్నారు. అదే ఊపు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ని మిగిలిన 11 నియోజకవర్గాల్లో డిమాండ్ పెరుగుతుం ది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాలు 20 నుండి 30 బస్సుల్లో తరలివెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

Water Released From Kannepalli To Annaram Barrage