Friday, April 26, 2024

నిండు కుండలా మూసి…. రెండు గేట్లు ఎత్తిన అధికారులు…

- Advertisement -
- Advertisement -

Water released from musi river

సూర్యాపేట: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసి నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద నదిపై నిర్మించిన మూసి ప్రాజెక్టు కు 6 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తున్నది. దీనితో ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టనికి చేరుకున్నది.. ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తేయడంతో 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎస్ఇ రమేష్ క్రస్ట్ గేట్లను ఎత్తి విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 642.5 అడుగులు మేర నీరు చేరుకుంది. గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాలు, నది సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News