Home తాజా వార్తలు అటవీ ప్రాణులు, పక్షుల కొరకు నీటి క్షేత్రాలు…

అటవీ ప్రాణులు, పక్షుల కొరకు నీటి క్షేత్రాలు…

Water resources

 

కాసిపేట: వేసవిలో అటవీ ప్రాణులు, పక్షుల దాహార్తినీ తీర్చేందుకు ఫారెస్టు శాఖ ఆద్వర్యంలో అటవి ప్రాంతంలో నీటి తొట్టిలను ఏర్పాటు చేసి, వాటిలో నీటిని ట్యాంకర్ల ద్వారా నింపారు. అలాగే అలవీ ప్రాంతంలో నీటి చెలిమలు వున్న ప్రాంతాలను శుభ్రం చేసారు. దేవాపూర్ ఫారెస్టు రేంజి పరిదిలో సోనాపూర్, దేవాపూర్ అటవీ ప్రాంతాలలో శనివారం ఫారెస్టు శాఖ బృందం పరీశీలించారు. అటవి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిసి పుటేజీలో నీరు వున్న ప్రాంతాలకు వచ్చిన పక్షులను, అడవి జంతువులను, నెమళ్లు, పలు రకాల పక్షులను పరీశీలించినట్లు డిప్యూటి రెంజ్ ఆఫీసర్ సరోజరాణి పేర్కొన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని వేసవిలో వాటికి నీటి అందించేందుఏకు అటవి ప్రాంతంలో ఫిట్స్ నిర్మించి వాటిలో నీటిని నిలువ వుంచడం జరిగిందన్నారు. పక్షులను, అటవి జంతువులను వేసివిలో దాహార్తి నుండి విముక్తి చేసేందుకే ఈ కార్యాక్రమం చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యాక్రమంలో ఎఫ్‌డివో నాగభూషణం, సెక్షన్ ఆఫీసర్లు జాలీంషా, భీమయ్య, బీట్ ఆఫీసర్లు నాగమణి, మధుకర్ పాల్గోన్నారు.

 

Water resources for birds and animals