Home తాజా వార్తలు గోదావరి నదిలో జలక్రీడల నిర్వహణ అద్భుతం

గోదావరి నదిలో జలక్రీడల నిర్వహణ అద్భుతం

Water sports

 

గోదావరిఖని : శభాష్ చందర్… గోదావరి నదిలో తెప్పల పోటీలను అద్భుతంగా చేశారు.. కాళేశ్వరం విశిష్టతను మరింత పెంచారు.. అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గత ఆదివారం గోదావరిఖనిలోని గోదావరి నదిపై నిర్వహించిన తెలంగాణ మత్యవీర కెసిఆర్ రాష్ట్రస్థాయి తెప్పల పోటీల విశేషాలను సిఎంకు వివరించారు. ఈ పోటీల పట్ల క్రీడాకారులు చూపించిన ఉత్సాహం, స్థానిక ప్రజల ఆసక్తి, వండర్‌బుక్ ఆఫ్ రికార్డు సాధన తదితర విశేషాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా గోదావరి నదిపై తెప్పల పోటీలను విజయవంతంగా నిర్వహించి రాష్ట్రంలో జలక్రీడలకు కొత్త వేదికను సృష్టించారని అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కీర్తి మరింత పెరిగేలా ఈ పోటీలు జరిగాయని తెలిపారు. గోదావరినదిపై రెగట్టా పోటీలను చేపట్టేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధ్యత తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌లో జరిగే రెగట్టా పోటీలు గోదావరి నదిపై నిర్వహించబోతున్నామని ఎమ్మెల్యే చందర్ తెలిపారు.

Water sports in Godavari River is Amazing