Home భద్రాద్రి కొత్తగూడెం పోడు భూముల సమస్య సాధించి తీరుతాం

పోడు భూముల సమస్య సాధించి తీరుతాం

going to have a problem with the lands

 కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి                                                                                                                 మహా ధర్నాలో పాల్గొన్న రేణుకా చౌదరి 

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యంగ హక్కులను కాలరాస్తూ.. పాలన సాగిస్తుందని, అందుకు నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పోడు భూముల సమస్యనేనని మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో టిపిసిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడవల్లి క్రిష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో భాగంగా జరిగిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మిదేవిపల్లి మండలంలోని మార్కెట్ యార్డు నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమస్యలతో కూడిన  వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కిరణ్‌కుమార్‌కు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యను  సాధించే వరకు పోరాడాతామన్నారు. జిల్లాలో సమస్యలు నిండుగా ఉన్నా సమస్యలు మెండుగా ఉన్నాయని, అందుకు గల కారణం ఇక్కడ పాలక ప్రభుత్వ ఎంఎల్‌ఎలు, ఎంపిలేనని అన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని విభజించి పాలిస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు త్యాగాలు చేసిన అమరుల కుటుంబాలను ఆదుకోకపోగా.. అక్కరకురారు అన్నట్టుగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కుటుంబంలో అందరికి పదవులు కట్టబెడుతూ.. బంగారు తెలంగాణను ప్రక్కన బెట్టి బంగారు కటుంబం కోసం సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నాడని ఆరోపించారు. అమాయకులైన గిరిజనుల పైకి పోలీసులను, అధికారులను ఉసిగొలిపి భయబ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్యని దుయ్యబట్టారు. పోడు భూమిని సాగు చేసుకుంటున్న వారందరికి తక్షణమే పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాధారణ రైతులతో పాటు, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సక్రమంగా నిర్వహించక రాష్ట్రమంతటా భూ సమస్య ఏర్పడడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యక్ష కారణమైందన్నారు.  భూరికార్డులో దొర్లిన తప్పులను యుద్ధప్రాతిపదికన సరిదిద్ది, తక్షణమే కొత్త పాస్ పుస్తకాలు అందించాలన్నారు. భూమిపై హక్కులు కలిగి ఉన్న పాస్ పుస్తకాలు ప్రభుత్యం పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. భూరికార్డుల తప్పుల వలన ప్రభుత్వ పథకాలు కోల్పోతున్న రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. థరణి వెబ్‌సైట్‌లో ఉన్న సాంకేతిక లోపాలను వెంటనే సరిచేయాలని, పంట రుణాలు పొందే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. బయ్యారం స్టీల్  ప్లాంట్  ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్షం వహిస్తున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దిరిశాల భద్రయ్య,గూడురు నారాయణ రెడ్డి, మాజీ ఎంల్‌సి పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రధాకిషోర్, మల్లు రమేష్, రాయల నాగేశ్వరరావు, మాలోత్ రాందాస్‌నాయక్, గిరిబాబు, ఇల్లందు నియోజకవర్గ బాధ్యులు హరిప్రియ, అశ్వారావు పేట నియోజకవర్గ బాద్యులు పద్మావతి, పార్టీ శ్రేణులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.