Sunday, December 3, 2023

కెసిఆర్ తెలంగాణలో పుట్టడమే మన అదృష్టం: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

We are lucky to KCR be born in Telangana

 

సిద్దిపేట: కొడకండ్లలో లబ్దిదారుల కళ్లలో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేశారు. నిర్మాణం పూర్తయిన 1250 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్  మాట్లాడారు.  2014 కంటే ముందు తరువాత తెలంగాణలో పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అన్నం పెట్టిన పాలకులు, ప్రభుత్వాలను ప్రజలు మరువొద్దన్నారు. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పథకాలతో లబ్ది జరిగింది ఒక్క తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. లబ్దిపొందిన వాళ్లే ప్రభుత్వాన్ని విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మినట్టే ఉంటుందన్నారు. సిఎం కెసిఆర్ తెలంగాణలో పుట్టడమే మన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్‌పి చైర్మన్ రాధాకృష్ణ శర్మ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News