Home అంతర్జాతీయ వార్తలు నేపాల్ కొత్త ప్రభుత్వంలో చేరబోం: మధేశీలు

నేపాల్ కొత్త ప్రభుత్వంలో చేరబోం: మధేశీలు

Nepalఖాట్మండు: నేపాల్‌లో ఆరు నెలలపాటు ఆందోళన చేసిన మధేశీలు కొత్త ప్రభుత్వంలో చేరబోవడం లేదని, కానీ కొత్త కూటమికి సాయం అందించనున్నారని మధేశీల గ్రూప్ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ లాల్ కర్ణ తెలిపారు. సద్భావన పార్టీకి సహ-అధ్యక్షుడైన లక్షణ్ లాల్ కర్ణ మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలో చేరేందుకు తమకు ఆసక్తి లేదని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా యునైటెడ్ డెమోక్రటిక్ మధేశీ ఫ్రంట్ గత ఏడాది నుంచి నిరసనలు తెలుపుతోందని, అయితే నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్-మావోయిస్ట్ సెంటర్‌తో కూడిన  కొత్త కూటమి  ప్రభుత్వం ఏర్పాటుకు తాము సాయపడతామని అన్నారు. మధేశీలు తమ డిమాండ్ల కోసం సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆరు నెలలపాటు ఉద్యమించారు. వారి ఆందోళన కారణంగా 50 మంది మరణించారు. అంతేకాక వారి ఆందోళన, దిగ్భందనం కారణంగా  భారత్ నుంచి నేపాల్‌కు సరకు రవాణను దెబ్బతీసింది.