మనతెలంగాణ/అర్వపల్లి
దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని విద్యుత్ శాఖ మంత్రి వర్యులు జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ఫణిగిరి గ్రామంలో శ్రీసీతారామస్వామి ఆలయ దేవాస్థాన నూతన కమిటీ చైర్మన్ ప్రమాణోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నూతన ఆలయ చైర్మన్‌గా ఎన్నికైనా దేవిడి సుభాష్‌రెడ్డిని ప్రమాణ స్వీకరణ చేయించారు. అంతకు ముందు, ఎంపీ బూర్రనర్సయ్య గౌడ్‌ని, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ని, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాన్ని, భౌద్ధ క్షేతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆల య నిర్మాణానికి, రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్ల.50లక్షల వ్యయంతో నిర్మాణం చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత దేవాలయాలను యాదగిరి లక్ష్మినర్సింహ్మస్వామి, కొమరవెల్లి మల్లన్న, అర్వపల్లి యోగానంద లక్ష్మినర్సింహ్మస్వామి దేవాలయాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 60ఏళ్లుగా తుంగతుర్తి వెనుకబడి ఉన్న ప్రధానంగా ఈ పాత్రంలోనే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికే 24గంటల విద్యుత్, సాగునీరు, తాగు నీరు వచ్చే జూన్ నుంచి రైతులకు ఎస్సారెస్పీ ద్వారా రెండు పంటలకు నీరు అందిస్తామన్నారు. ఫణిగిరి బౌధ్ధ క్షేత్రాంగా చేస్తామన్నారు.
గతంలో తెలంగాణ వనరులను దోచుకున్నట్లే గుడిలు సంస్కృతిక వారస్వత్తన్ని దోచుకున్నారన్నారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని గతంలో తరలించాలని చూసిన అర్భావనం అప్పుడే అడ్డుకున్నమన్నారు. నాగారం మండలాన్ని దరిద్ర రేఖకు అధిగమించిన మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దుమన్నారు. యావత్ దేశానికే నాగారంని మోడల్ మండలంగా తీర్చిదిద్దుతామన్నారు. మండలంలోని దళిత వాడలో సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. మండలంలోని పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు. ఎంపీ, ఎంఎల్‌ఏ గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత పాలకుల వలన వెనుక బడిన నియోజకవర్గాన్ని వేల కోట్లలతో రోడ్లు, మౌలిక వసతులు కల్పించిన ఘనత కేసిఆర్ దే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నేరవేర్చిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. ఈకార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ పరిశీలకులు ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమభారత్‌కుమార్, తిరుమలగిరి మార్కెట్ చైర్మన్ పాశం విజయయాదవరెడ్డి, ఎంపీపీ దావులమనీషవీరప్రసాద్, తిరుమలగిరి ఎంపీపీ కొమ్మినేని సతీష్, జెడ్‌పిటిసి పెరాల పులమ్మ, పిఎసిఎసీ చైర్మన్ అశోక్‌రెడ్డి, రైతు సమన్వయ మండల కోఆర్టీనేటర్ పానుగంటి నర్సింహ్మరెడ్డి, తిరుమలగిరి మార్కెట్ వైస్ చైర్మన్ గుజ్జ యుగేందర్‌రావు, సర్పంచ్ కలెట్లపల్లి ఎల్లమ్మ ఉప్పలయ్య, నూతన చైర్మన్ డి. సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గుండగాని అంబయ్య, టీఆర్‌ఎస్ నాయకులు పాశం యాదవరెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు కలెట్లప్లి శోభన్‌బాబు, కలెట్లపల్లి ఉప్పలయ్య, పొదిల రమేష్, కే.శ్రీను, రాంమూర్తి, యాదగిరి, ఉమ్మడి జిల్లా అస్టిసెంట్ కమిషనర్ అన్నెపర్తి సులోచన, ఈవో వెంకట్‌నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్ధార్ చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ నాయకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.