Home తాజా వార్తలు విశాలంగా గుడి, మసీదు కటిస్తాం

విశాలంగా గుడి, మసీదు కటిస్తాం

We will build temples and mosques at govt expense

 

ప్రభుత్వ ఖర్చులతోనే నిర్మాణాలు

సచివాలయ పాత భవనాలు కూల్చివేస్తుండగా శిథిలాలు పడి ప్రార్థన మందిరాలకు కొంత ఇబ్బంది కలిగింది
అది నాకు చాలా బాధ కలిగించింది
ఇది కాకతాళీయంగానే జరిగిన ఘటన
అందరూ సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నా
త్వరలో నిర్వాహకులతో భేటీ
తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం, ఆ స్ఫూర్తినే కొనసాగిస్తాం : ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ : సెక్రటేరియట్‌లోని పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన విచారాన్ని, బాధను వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సిఎం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్పూర్తిని కొనసాగిస్తామన్నారు. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన అని సిఎ పేర్కొన్నారు. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

సచివాలయంలోని పాత భవనాలను కూల్చివేసి అక్కడ కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ క్రమంలో ఎత్తయిన భవనాలు కూల్చే సందర్భంలో పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగిందనే విషయం తనకు తెలిసిందన్నారు. అయితే ఇలా జరగడం పట్ల తాను ఎంతో బాధపడుతున్నాను.. చింతిస్తున్నానని సిఎం వ్యాఖ్యానించారు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదన్నారు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం తప్ప, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో మరింత విశాలంగా ఎన్ని కోట్లయినా వెనుకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తామని సిఎం కెసిఆర్ హామి ఇచ్చారు. త్వరలోనే దేవాలయం, మసీదు నిర్వాహకులతో తాను సమావేశమవుతానని పేర్కొన్నారు. వారి అభిప్రాయాలు తీసుకుని కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.

సిఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణంలో భాగంగా కొత్త మసీదును, దేవాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. ప్రస్తుతం పాత సెక్రటేరియట్ భవనంలో ఉన్న మసీదు, దేవాలయాల కన్నా పెద్ద స్థాయిలో వాటిని నిర్మించేందుకు సెక్యులర్ నాయకుడైన సిఎం నిర్ణయం తీసుకోవడం.

ఇందుకు సంబంధించి త్వరలోనే నిర్వాహకులతో మాట్లాడేందుకు సమావేశాలు నిర్వహించనుండడం పట్ల హోంమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నూతన సెక్రటేరియట్ భవనాన్ని అధునాతన స్థాయిలో నిర్మించడం పట్ల అది ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని హోం మంత్రి అన్నారు. నూతన భవనం లో సాంకేతిక, ఇతర సౌకర్యాలు తో కూడిన సదుపాయాలు ఉండడం వల్ల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనకరమని హోం మంత్రి తెలియజేశారు. మసీదు, దేవాలయాలు కూడా భారీ ఎత్తున నిర్మించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ స్వాగతించారు.

కెసిఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు
సచివాలయం ప్రాంతంలోనే కొత్త ఆలయం, మసీదు కట్టిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. సిఎం మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సిఎం కెసిఆర్ యుద్దప్రతిపాదన స్పందించి ఒక ప్రకటన విడుదల చేయడం పట్ల అసదుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలోని పాత భవనాల కూల్చి వేత సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న ఆలయం, మసీదు స్వల్పంగా దెబ్బతిన్నాయన్నారు. దీంతో వాటిని కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించి ఆలయం, మసీదులకు ఇబ్బంది కలగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రాంతంలోనే ప్రస్తుతం ఉన్న వాటికంటే విశాలంగా, సౌకర్యవంతంగా ఆలయం, మసీదును నిర్మిస్తామని, వాటికోసం అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని సిఎం ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే యునైటెడ్ ముస్లిం ఫోరం తరఫున పూర్తి స్టేట్‌మెంట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని అసద్ పేర్కొన్నారు.

సిఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

హోం మంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్, టిఎన్‌జిఒ కేంద్ర కమిటీ ప్రకటన

సచివాలయం నిర్మాణంలో భాగంగా కొత్త మసీదును, దేవాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. ప్రస్తుతం పాత సెక్రటేరియట్ భవనంలో ఉన్న మసీదు, దేవాలయాల కన్నా పెద్ద స్థాయిలో వాటిని నిర్మించేందుకు సెక్యులర్ నాయకుడైన సిఎం నిర్ణయం తీసుకోవడం… ఇందుకు సంబంధించి త్వరలోనే నిర్వాహకులతో మాట్లాడేందుకు సమావేశాలు నిర్వహించనుండడం పట్ల హోంమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నూతన సెక్రటేరియట్ భవనాన్ని అధునాతన స్థాయిలో నిర్మించడం పట్ల అది ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

సరైన సమయంలో స్పందించారు :అసదుద్దీన్
సచివాలయం ప్రాంతంలోనే కొత్త ఆలయం, మసీదు కట్టిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. సిఎం మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సిఎం కెసిఆర్ యుద్ధప్రతిపాదన స్పందించి ఒక ప్రకటన విడుదల చేయడం పట్ల అసదుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలోని పాత భవనాల కూల్చి వేత సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న ఆలయం, మసీదు స్వల్పంగా దెబ్బతిన్నాయన్నారు. దీంతో వాటిని కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ స్పందించి ఆలయం, మసీదులకు ఇబ్బంది కలగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రాంతంలోనే ప్రస్తుతం ఉన్న వాటికంటే విశాలంగా, సౌకర్యవంతంగా ఆలయం, మసీదును నిర్మిస్తామని, వాటికోసం అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని సిఎం ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.

సిఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : టిఎన్‌జిఒ
నూతన సచివాలయ ప్రాంగణంలో అధునాతనమైన హంగులతో కొత్త మసీదును, దేవాలయాలను నిర్మిస్తామని త్వరలో మత పెద్దలతో సమావేశం అవుతామని సిఎం కెసిఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి పనుల నిమిత్తం వచ్చిన ఉద్యోగులకు, ప్రజలకు భరోసాను, నమ్మకాన్ని కొత్త మసీదు, దేవాలయాలు కలిగిస్తాయని టిఎన్జీఓ కేంద్ర సంఘం నాయకులు కారం రవీందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్‌లు పేర్కొన్నారు. పాత సచివాలయ భవనాలు కూల్చివేస్తున్న సందర్భంగా మసీదు, నల్ల పోచమ్మ దేవాలయాలు ధ్వంసం కావడంపై సిఎం కెసిఆర్ బాధను వ్యక్తం చేయడంతో పాటు వెంటనే నూతన సచివాలయంలో అందరి మనోభావాలకు అనుగుణంగా మసీదును, నల్ల పోచమ్మ ఆలయాలను నిర్మిస్తామని చెప్పడం కెసిఆర్ గొప్పతనానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.

మరింత గొప్పగా గుడి, మసీదులను నిర్మించాలి: నరేందర్‌రావు
కొత్త సచివాలయంలో మందిరం, మసీదులను ప్రభుత్వమే పూర్తి ఖర్చుతో నిర్మించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నదానికంటే ఎక్కువ స్థలంలో మరింత గొప్పగా గుడి, మసీదులను నిర్మిస్తానని సిఎం కెసిఆర్ పేర్కొన్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు, ఉపాధ్యక్షురాలు మంగమ్మ, షేక్ యూసుఫ్ మియా, కార్యదర్శిలు కృతజ్ఞతలు తెలిపారు.

We will build temples and mosques at govt expense