Saturday, April 20, 2024

గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమను విస్తరిస్తాం : మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

టెక్నాలజీ పరంగా భారత్‌ ఇంకా వెనుకబడి ఉన్నదని మంత్రి కెటిఆర్ తెలిపారు. జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా మనకు ఆదర్శమని చెప్పారు. ఇన్నోవేషన్‌ రంగంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని అన్నారు. నిజామాబాద్‌లో కాకతీయ స్యాండ్‌ బాక్స్‌ ఆధ్వర్యంలో స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని మాట్లాడుతూ టెక్నాలజీ ఫర్‌ ఇంపాక్ట్‌ అండ్‌ స్కేల్‌ అనే అంశపై మాట్లాడారు.

ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టయిన కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేండ్లలో నిర్మించామని చెప్పారు. టెక్నాలజీ ఫర్‌ ఇంప్యాక్ట్‌ పేరుతో స్యాండ్‌ బాక్స్‌ సంస్థ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. లక్ష కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేసి కోటి ఇండ్లకు మంచినీరు అందిస్తున్నామని సూచించారు. ప్రతి ఇంటికి ఫైబర్‌ కనెక్షన్‌ ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమను విస్తరిస్తామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News