Home తాజా వార్తలు సాగునీరు తీసుకువస్తా

సాగునీరు తీసుకువస్తా

Government Schools

 

ప్రభుత్వ బడులలో సౌకర్యాలు మెరుగుపరుస్తాం
యువతకు ఉపాధి చర్యలు
అనంతగిరి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
దాతలు ప్రభుత్వ బడులను దత్తత తీసుకోవాలి
మన తెలంగాణ తో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

రంగారెడ్డి : అదరించి అండగా నిలిచిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ది కోసం శాయశక్తులా కృషిచేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పెర్కొన్నారు. మంగళవారం నాడు ఆమె మన తెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ….ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు సాగుతుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన మాదిరిగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సైతం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి పూర్తి చేయడానికి సియం కెసిఆర్ చిత్తశుద్దితో ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పనకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల సహకారంతో పాఠశాలను అభివృద్ది చేస్తామని తెలిపారు.

సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తమ గ్రామాలను అన్ని రంగాలలో తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తున్నారని ఆదే విదంగా తమ గ్రామ పాఠశాలలో గ్రామానికి చెందిన పిల్లలు చదువుకుంటున్నారని దీనిపై ప్రత్యేక శ్రద్ద చూపి కనీస వసతులు కల్పన కోసం తొడ్పాటు అందచేయాలన్నారు. నీరు, విద్యుత్, పారిశుద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పనకు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. జిల్లాలోని మహేశ్వరం తదితర ప్రాంతాల్లో ఫార్మాసిటితో పాటు ఐటి పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి స్థానిక యువతకు ఉపాధి కల్పనకు కృషిచేస్తామన్నారు. ఐటి మంత్రి కెటిఆర్ చురుకుగా వ్యవహరిస్తు రాష్ట్రంకు పెద్ద ఎత్తున నూతన పరిశ్రమలు, ఐటి సంస్థలను తీసుకువసున్నారని ప్రభుత్వ నిబందనల ప్రకారం స్థానికులకు కావలసిన శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.

డ్వాక్రా సంఘాల ఎదురుకుంటున్న సమస్యలను సియం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం చర్యలు చేపడతామన్నారు. ఆర్ధిక మాంద్యం ఉన్న కేంద్రం నుంచి రావలసిన నిధులలో కోత పడుతున్న సంక్షేమ రంగంకు, ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం సమృద్దిగా నిధులు కేటాయించిందన్నారు. రైతు సంక్షేమమే ద్యేయంగా రుణమాఫి, రైతు బందు, రైతు బీమాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి రైతు సంక్షేమ ప్రభుత్వంగా ప్రభుత్వం నిలిచిందన్నారు. 57 సంవత్స రాలకు పెన్షన్ ఇవ్వడానికి సైతం నిధులు కేటాయించిందన్నారు. దీర్ఘకాలీకంగా ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాద్యానత ఇచ్చి నిధులు కేటాయించిందన్నారు. హైద్రాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపడతామన్నారు. న్యాయపరంగా ఉన్న చిక్కులను తొలగించి రోడ్డు పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు.

ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందన్నారు. రోడ్డు లేని గ్రామాలకు రోడ్లు వేయించి బస్సు సౌకర్యం కల్పించడానికి చర్యలు చేపడతామన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులతో త్వరలోనే సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాను మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రత్యేకంగా చర్యలు చేపడతామన్నారు.

అనంతగిరి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషిచేస్తానని తెలిపారు. పర్యాటక రంగంలో రాష్ట్రంలోనే అనంతగిరి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. తాండూర్‌లో కంది బోర్డు స్థాపించడం కోసం స్థానిక ఎంపి రంజిత్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో ఖచ్చితంగా చర్యలు చేపడతామన్నారు.
వికారాబాద్ జిల్లాను చార్మినార్‌లో జోన్‌లో విలీనం చేసినందుకు సియం కెసిఆర్ గారికి దన్యవాదములు తెలిపారు.

దాతలు ముందుకు రావాలి
గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులతో పాటు వ్యాపారవేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చి ప్రభుత్వ బడులను దత్తత తీసుకుని అభివృద్ది చేయాలని సబితారెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో రియల్ వ్యాపారులు, బిల్డర్‌లు సైతం స్వచ్చదంగా ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్దికి సహకరించాలన్నారు.

We will improve facilities in Government Schools