Home రాష్ట్ర వార్తలు ట్రంప్‌లా గెలుస్తాం

ట్రంప్‌లా గెలుస్తాం

  • ఇప్పుడే సర్వేలు చేయించడం హాస్యాస్పదం: జానారెడ్డి

Jana-Reddy

హైదరాబాద్ : టిఆర్‌ఎస్ చేయిస్తున్న సర్వే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, అమెరికాలో ఎవరూ ఊహించని విధంగా ట్రంప్ గెలిచినట్లే రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధి స్తుందని అసెంబ్లీలో విపక్ష నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, ఎంఎల్‌సి పొంగులేటి సుధాకరరెడ్డిల తో కలిసి సోమవారం ఆయన సిఎల్‌పి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్వేలపై తనకు విశ్వాసం లేదని, 2 ఏళ్ల తరువాత జరగనున్న ఎన్నికల గెలుపు ఓటముల పై ఇప్పటి నుంచే సర్వేలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎప్పు డో వచ్చే ఎన్నికల ఫలితాలు, ప్రజా సమస్యల్లో ఏది ముఖ్యమో ప్రభుత్వం ఆలోచించుకోవాలని హితవు పలికారు. సర్వేల కన్నా ప్రజాభిప్రాయాలనే కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు గు రించి ప్రశ్నిస్తే, పొత్తులు ప్రస్తుతం అప్రస్తుతం అని ఎన్నికలకు ముందు పరిస్థితులకు అనుగుణంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంద న్నారు. తెలుగుదేశంతో పొత్తు విషయంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించినట్లుగా కనిపిస్తోందన్నారు.
యుటర్న్ ప్రభుత్వం : షబ్బీర్ అలీ
ప్రాజెక్టుల కంటే ముందు వాటి కాలువల పనులను వేగవంతం చేయా లంటూ ఆదేశించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తమది యు-టర్న్ ప్రభుత్వమని నిరూపించుకున్నారని శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సన్నాసులు, దద్దమ్మలే ప్రాజెక్టులను వదిలేసి కాలువ లను ముందుగా నిర్మిస్తారంటూ గతంలో తీవ్రమైన పదజాలంతో కాంగ్రె స్‌ను విమర్శించారని, ఇప్పుడు సన్నాసులు, దద్దమ్మలు ఎవరో కెసిఆర్‌కే విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సందర్భంలోనూ యుటర్న్ తీసు కోవడం టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా, రీ డిజైనింగ్‌లపై కాంగ్రెస్ చేస్తున్న వాద నలే నిజమవుతున్నాయని ఆయన అన్నారు. గడచిన మూడేళ్లుగా బాధ్యా యుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ చేసిన నిర్మాణాత్మకమైన సూచలను కొట్టిపారేస్తూ , ఆచరణలో ఆ సూచనలనే అమలు చేస్తున్న ఉదంతాలు అ నేకం ఉన్నాయన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో వాస్తవ గణాంకాలను అ సెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జానారెడ్డి విశ్లేషించి చెపితే తేలి గ్గా తీసిపారేసి,మరుసటి ఏడాది చర్చలో ఆయన చెప్పింది నిజమే అని అంగీకరించడం పరిపాటైందన్నారు. అలాగే ముస్లింలకు రిజర్వేషన్లు క ల్పించే విషయంలో చట్టపరమైన బిసి కమిషన్ సిఫారసులు ఆవశ్యమం టూ చెపితే, ముందు తీసిపారేసి, తరువాత కమిషన్ సిఫారసులు తెప్పిం చుకున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఇకనైనా ప్రభపుత్వం వాస్తవిక ధృక్ఫథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు.
రాహుల్ సభను విజయవంతం చేయండి
ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ముఖ్యఅతిధిగా హాజరవుతున్న తెలంగాణ ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలని సిఎల్‌పి తరపున జానారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాల వైఫల్యాలను ఈ సభలో ఎండగడతామన్నారు. ఎటువంటి పనులున్నా, ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా దూరభారమైనా స్వచ్ఛంధంగా తరలి రావాలని ఆయన కోరారు.